PKSDT: టాలీవుడ్‌లో ఒకే కుటుంబం నుంచి హీరోలు కలిసి చేసిన సినిమాలు ఇవే
YouSay Short News App
తమిళ హిట్ ‘వినోదయ సీతమ్’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తమిళంలో డైరెక్ట్ చేసిన ‘సముద్రఖని’ ఈ సినిమాకు కూడా దర్శకత్వం చేయనున్నాడు.
ఈ సినిమాలో మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించనున్నారు. మోడ్రన్ దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్, యువకుడి పాత్రలో తేజ్ కనిపించనున్నారు.
ఒక కుటుంబానికి చెందిన తారలు ఇలా ఒకే సినిమాలో కనిపించడం ఈ మధ్య పరిపాటిగా మారింది. అలా వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు డబుల్ ధమాకాని అందించాయి. గత 20ఏళ్ల కాలంలో ఇలా వచ్చిన సినిమాలేంటో చూద్దాం.
విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రానా కలిసి నటించిన ప్రాజెక్టు ఇది. వెబ్ సిరీస్‌గా విడుదల అవుతోంది. నిజ జీవితంలో బాబాయి, అబ్బాయిగా ఉంటూ తండ్రీ కొడుకులుగా ఇందులో నటించారు.
రానా నాయుడు
మెగా ఫ్యాన్స్‌కు కన్నుల విందు చేసిన సినిమా ఇది. సిద్ధ పాత్రలో రామ్‌చరణ్ నటించగా, కామ్రేడ్ ఆచార్య పాత్రను చిరు పోషించాడు. తోటి కామ్రేడ్ కుమారుడైన చెర్రీకి సంరక్షకుడిగా చిరంజీవి నటించాడు.
ఆచార్య
అక్కినేని నాగచైతన్య, నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. చైతన్యకు తండ్రి, తాతగా నాగార్జున నటించాడు.
బంగార్రాజు
నాగచైతన్య మామయ్య వెంకటేష్‌తో కలిసి చేసిన సినిమా ‘వెంకీ మామ’. సినిమాలో కూడా మామాఅల్లుళ్ల పాత్రలనే పోషించారు. 2019లో
ఈ చిత్రం విడుదలైంది.
వెంకీ మామ
రవితేజ చిన్ననాటి పాత్రలో రవితేజ కుమారుడు నటించాడు. ఇందులో అంధుడిగా నటించడం విశేషం.
రాజా ది గ్రేట్
మహేశ్ బాబు, కుమారుడు గౌతమ్ నటించిన సినిమా ఇది. మహేశ్ బాబు చిన్ననాటి పాత్రలో గౌతమ్ నటించాడు.
వన్ నేనొక్కడినే
అక్కినేని మూడు తరాలు కలిసి చేసిన సినిమా ఇది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇందులో కనిపించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
మనం
మంచు ఫ్యామిలీ కలిసి నటించిన చిత్రమిది. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కలిసి నటించారు.
పాండవులు పాండవులు తుమ్మెద
మంచు విష్ణు, మంచు మోహన్‌బాబు కలిసి చేసిన మరో చిత్రం రౌడీ. ఇందులో వీరిరువురు తండ్రీకొడుకుల పాత్రలు పోషించారు.
రౌడీ
డాడీ సినిమాలో చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి నటించారు. బన్నీ ఇందులో ఓ డ్యాన్సర్ పాత్ర పోషించాడు. చిరు డ్యాన్స్ మాస్టర్‌గా నటించాడు.
డాడీ
శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో చిరంజీవి, పంజా వైష్ణవ్ తేజ్ కలిసి నటించారు. వైష్ణవ్ ఇందులో
ఓ పేషంట్ పాత్రను పోషించాడు.
శంకర్‌దాదా ఎంబీబీఎస్
మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి నటించిన చిత్రమిది. అయితే, పవన్ కళ్యాణ్ కేమియోగా కనిపిస్తాడు.
శంకర్‌దాదా జిందాబాద్
చిరంజీవి, నాగబాబు కలిసి నటించారు. ఇందులోనూ సోదర సమానమైన పాత్రలు పోషించారు.
మృగరాజు
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.