YouSay Short News App

ప్రభాస్‌ ప్రేయసి మరొకరితో ప్రేమలో ఉందా!

‘1’ నేనొక్కడినేలో మహేశ్‌ సరసన జతకట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి కృతి సనన్. ప్రస్తుతం బాలివుడ్‌లో బిజీగా ఉన్న ఈ భామ ‘ప్రేమ’ పుకార్లు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

వరుసగా హిట్లు అందుకుంటూ క్రేజీ ప్రాజెక్టులతో తోటి సహనటీమణులకు అందకుండా వెండితెరపై మెరుస్తోంది

ప్రస్తుతం షెహ్‌జాదా సినిమా నుంచి విడుదలైన ‘సోనా హూ మై’ పాటలో ఈ పొడుగు కాళ్ల సుందరి సౌందర్యానికి కుర్రకారు మైమరచిపోతున్నారు.

కైపెక్కించే కృతి అందాలకు పాట విడుదలైన  కొద్ది కాలంలోనే సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లోకి వెళ్లింది.

కార్తిక్‌ ఆర్యన్‌తో కృతి సనన్‌కు ఇది రెండో సినిమా. అంతకు ముందు 2019లో వచ్చిన ‘లుకా చుప్పీ’లో వీరిద్దరూ కలిసి నటించారు.

కార్తిక్‌, కృతి ప్రేమలో ఉన్నారని గతంలో అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా షెబ్‌జాదా ప్రమోషన్లలో ఈ జంట పాల్గొంటుండటంతో మరోసారి ఆ వార్తలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.

న్యూ ఇయర్‌ వేడుకను ఈ జంట కలిసి జరుపుకుందనే వార్త.. డేటింగ్‌ రూమర్లకు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది.

“మా ఇద్దరి జంట తెరపై చక్కగా కనిపిస్తుంది.  మా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.  అందుకే జనం మేమిద్దరం డేటింగ్‌ చేస్తున్నామనుకుంటున్నారేమో” అని కృతి  ఈ వార్తలపై స్పందించింది.

కృతి సనన్‌ రూమర్లపై స్పందించింది గానీ కొట్టిపారేయలేదు. దీంతో చాలా తెలివిగా తప్పించుకుందంటూ నెటిజన్లు కామెంట్లు  చేశారు.

ఇటీవల కృతి సనన్‌ను ప్రభాస్‌కు కూడా జతకట్టారు. ఆదిపురుష్ సెట్‌లో ప్రభాస్‌, కృతికి ప్రపోజ్ చేశాడంటూ వార్తలు చక్కర్లు కొొట్టాయి.

ప్రభాస్‌తో డేటింగ్ రూమర్లను కృతి కొట్టిపారేసింది. ‘ప్రభాస్‌ కూడా అదేం లేదు సార్‌’ అంటూ ‘అన్‌స్టాపబుల్‌’ షోలో మొరపెట్టుకున్నాడు.

ప్రస్తుతం కృతి నటించిన షెహ్‌జాదా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో తొలి రూ.150 కోట్ల చిత్రం ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ఇది రీమేక్‌గా వస్తోంది.