Prithwi Shaw: పృథ్వీ షాపై దాడి చేసిన సప్న గిల్ ఎవరు?  వరుస వివాదాల్లో పృథ్వీ షా

YouSay Short News App

టీమిండియా పేసర్ ‘పృథ్వీ షా’పై జరిగిన దాడి ఘటన వైరల్ అవుతోంది. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని కొంతమంది దాడికి దిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరి దాడి చేసింది ఎవరు? పృథ్వీ షా సెల్ఫీ ఎందుకు ఇవ్వలేదు? తదితర విషయాలు తెలుసుకుందాం.

ఫిబ్రవరి 15న పృథ్వీ షా తన స్నేహితుడు సురేంద్రన్‌తో కలిసి శాంతాక్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కి వెళ్లాడు. సప్న గిల్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తన ఫ్రెండ్‌తో కలిసి పృథ్వీ షాతో సెల్ఫీ దిగడానికి వెళ్లింది.

సెల్ఫీ కోసం..

సప్న గిల్‌తో పాటు ఆమె ఫ్రెండ్ ఠాకూర్‌కి పృథ్వీ షా సెల్ఫీ ఇచ్చాడు. కానీ, తమ గ్రూపులోని వారందరితో దిగాలని వారిద్దరూ పట్టుబట్టారట.

ముదిరిన సెల్ఫీ వివాదం

తను డిన్నర్‌కి వచ్చానని, అంత టైం లేదని పృథ్వీ షా సానుకూలంగా తిరస్కరించాడు.

ఎంతచెప్పినా వినకపోవడంతో పృథ్వీ షా స్నేహితులు హోటల్ మేనేజర్ పిలిచి ఫిర్యాదు చేశారు. దీంతో వారిని బయటకు పంపించేశారు.

పృథ్వీ షా మీద కోపంతో హోటల్ బయట బేస్‌బాల్ బ్యాట్‌తో సప్న గిల్ బృందం పహారా కాసింది. పృథ్వీ స్నేహితుడు సురేంద్రన్ కారు అద్దాలను ధ్వంసం చేశారు.

అద్దాలు ధ్వంసం

దాడి సమయంలో కారులోనే ఉన్న పృథ్వీని అక్కడ ఉంచడం మంచిది కాదని భావించి వేరే కారులో పంపించారు. అయినా, సప్న గిల్ పృథ్వీని వెంబడించి అడ్డుకుంది. బేస్‌బాల్ బ్యాట్‌తో కారు అద్దాలు పగలగొట్టడానికి ట్రై చేస్తుండగా పృథ్వీ అడ్డుకున్నాడు. ఈ వీడియో వైరల్ అయింది.

వెంబడించి మరీ

కారు అద్దాలు ధ్వంసం చేయడంతో షా ఫ్రెండ్ సురేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తగు విచారణ చేసి సప్న గిల్‌తో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టు

సప్న గిల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఇన్‌స్టాగ్రాంలో ఈమెకు 2.2లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్, స్నాప్‌చాట్‌లోనూ కొంతమంది అనుసరిస్తున్నారు.

సప్న గిల్ ఎవరు?

కాశి అమర్‌నాథ్, నిర్హువా చలాల్ లండన్, మేరా వాతన్, రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్ ప్రాజెక్టుల్లో సప్న గిల్ నటించింది.

సెల్ఫీ కోసమని సప్న గిల్ పృథ్వీ షా దగ్గరికి వెళ్తే అసభ్యంగా ప్రవర్తించడాని సప్న గిల్ తరఫు న్యాయవాది చెప్పడం గమనార్హం. అంతేగాకుండా అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్నాడని న్యాయవాది ఆరోపించారు.

పృథ్వీ అసభ్యంగా..

సప్న గిల్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేయనున్నట్లు న్యాయవాది వెల్లడించారు. పృథ్వీ షాపై కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఫిర్యాదు చేస్తాం

పృథ్వీ షాకు చాలామంది  ఫ్యాన్స్ మద్దతుగా నిలిచారు. సప్న గిల్‌దే తప్పని చెబుతున్నారు. పైగా, పృథ్వీ షా దగ్గరి నుంచి సప్న గిల్ డబ్బులు డిమాండ్ చేసిందని నెటిజన్లు అంటున్నారు.

సప్న గిల్‌దే తప్పట

పృథ్వీ షా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ రెండు, మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. పృథ్వీ నేతృత్వంలో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలిచింది.

కొత్తేమీ కాదు

2019 విజయ్ హజారే ట్రోఫీ సమయంలో డోపింగ్ టెస్టులో పట్టుబడ్డప్పుడు పృథ్వీ విమర్శలు ఎదుర్కొన్నాడు.

డోపింగ్ టెస్టు

అంతేగాక 8 నెలల సస్పెన్షన్‌ని గురయ్యాడు. అయితే, దగ్గు టాబ్లెట్ వేసుకోవడం వల్లే పాజిటివ్ చూపించినట్లు పృథ్వీ వివరణ ఇచ్చాడు.

2022 ఐపీఎల్‌కి ముందు ‘యో-యో’ టెస్టులో పృథ్వీ విఫలమవ్వడం విమర్శలకు దారితీసింది. 16.5 పాయింట్ల సాధించాల్సి ఉంటే 15కన్నా తక్కువే వచ్చాయట.

యో-యో టెస్టులో ఫెయిల్

దీంతో పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ విషయంపై పృథ్వీపై పాంటింగ్ ఆరోపణలు చేయడం చర్చకు దారితీసింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.