సహజీవనం(Live in Relationship)లో సమస్యలెందుకొస్తున్నాయి?
YouSay Short News APP
పెళ్లిలో సానుకూలతలు, సమస్యలు ఉన్నట్లే లివ్‌ఇన్‌లోనూ సమస్యలు ఉంటాయి. ఇద్దరు సహచరుల మధ్య వచ్చే సమస్యలు చూద్దాం.
షేరింగ్:
ఇంటి పని, వంట పని షేర్ చేసుకోవచ్చని షార్ట్‌టర్మ్ లివ్‌ఇన్‌లోకి వెళ్తున్నారు. ఉద్యోగాల కారణంగా అవి సరిగా షేర్ చేసుకోలేనపుడు గొడవలు వస్తున్నాయి
అభిరుచులు
ఇద్దరి అభిరుచులు వేరైనపుడు రూం ఎంపిక, ఫర్నీచర్, ఫుడ్ సెలెక్షన్, వస్తువుల అమరిక ఇలా ప్రతి దాంట్లోనూ గొడవలే. ఈ చిన్న చిన్న గొడవలే అంతులేని మనస్పర్ధలకు దారి తీస్తాయి.
డబ్బు:
లివ్‌ఇన్‌లు పెరగడానికి మనీ మేనేజ్‌మెంట్ కూడా ఓ కారణం. అలాంటప్పుడు ఇద్దరూ సమానంగా షేర్ చేసుకోవాలి. ఏ ఒక్కరి డబ్బులు ఎక్కువ ఖర్చవుతున్నా గొడవలు మొదలవుతాయి.
ఎవరు గొప్ప?:
పెళ్లి అంటేనే సర్దుకుపోవడం ఇది నచ్చకనే అమ్మాయిలు, అబ్బాయిలు లివ్‌ఇన్‌లోకి వస్తారు. అప్పుడు ఇద్దరూ తాము సమానమనే భావన ఉంటే సరే, కానీ వారిలో ఏ ఒక్కరూ నేను గొప్ప అని భావించినా సమస్య షురూ అవుతుంది.
అభద్రత:
లివ్‌ఇన్‌లో ఎమోషనల్ ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ఎప్పుడైనా వదులుకోవాలనుకోవచ్చు. అప్పుడు మీలో మానసిక సంఘర్షణ మొదలవుతుంది.
ఎమోషనల్‌గా ఆధారపడటం:
షార్ట్‌టర్మ్ రిలేషన్‌షిప్ లక్ష్యంతో లివ్‌ఇన్ మొదలుపెట్టినపుడు, అందులో ఎవరో ఒకరు ఎమోషనల్‌గా మరొకరిపై ఆధారపడినపుడు బంధం సంక్లిష్టమవుతుంది.
సెక్సువల్:
ఇద్దరి మధ్య రొమాన్స్ ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఇద్దరిలో ఎవరో ఒకరు పని ఒత్తిడి కారణంగానో మరే ఇతర కారణాల వల్లనో మరొకరిని పక్కనబెట్టొచ్చు.
ఇది ఇంకొకరిలో తమపై ఆసక్తి తగ్గిపోతోందని, తనను తేలికగా తీసుకుంటున్నాడనే ఆలోచన పెంచుతుంది.
క్లారిటీ చాలా ముఖ్యం
మీరు లివ్‌ఇన్ మొదలుపెట్టాలి అనుకుంటే పై అంశాలన్నింటిపైనా క్లారిటీ ఉండాలి. ఎప్పుడైనా మీ పార్ట్‌నర్‌ని వదులుకోవడానికి సిద్దంగా ఉండాలి. ఎందుకంటే మీ కుటుంబం నుంచి కూడా మీకు సపోర్ట్ దక్కకపోవచ్చు.