రివర్స్ ఏజింగ్‌తో 18 ఏళ్ల కుర్రాడి లైంగిక సామర్థ్యం మనిషి మరణాన్ని జయించినట్లేనా!
Project Blueprint :
మానవ మేధస్సు సమీప భవిష్యత్తులో మరణాన్ని జయించనుందా? సృష్టి ధర్మాన్ని తిరగరాస్తూ నిత్య యవ్వనంగా మారే సాంకేతికతను కనుగొననుందా?..
రివర్స్ ఏజింగ్ ద్వారా 45 ఏళ్లు నిండిన ఓ వ్యక్తి 18 ఏళ్ల యువకుడిగా మారేందుకు చేసిన ప్రయత్నాల ఫలితాలు అవుననే సమాధానాలు చెబుతున్నాయి.
వయస్సును వెనక్కి తీసుకెళ్లి యవ్వనంగా మారటం
రివర్స్ ఏజింగ్?
రివర్స్ ఏజింగ్ ద్వారా యవ్వనాన్ని సాధించేందుకు గత కొన్నేళ్లుగా ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రయోగాలు తనపైనే చేయించుకుంటున్నాడు అమెరికా- కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్(45)
ప్రయోగాలు విఫలమైతే తన ప్రాణాలు పోతాయి.. సక్సెస్ అయితే నిత్య యవ్వనంగా ఉండాలనుకునే మానవుని కోరిక తీరినట్లే అని జాన్సన్ చెబుతున్నాడు.
అమెరికా- కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ డాక్‌సైట్ వ్యవస్థాపకుడు. బయోటెక్నాలజీ రంగంలో ప్రావీణ్యం ఉంది.
బ్రియాన్ జాన్సన్ ఎవరు?
శరీరంలో కొన్ని మార్పులు చేస్తే వయస్సు కనిపించకుండా ఎక్కువ కాలం జీవించవచ్చని బ్రియాన్ జాన్సన్ ఓ పుస్తకంలో చదివారు
ఆలోచన ఎలా?
దీంతో 18 ఏళ్ల వయస్సు వాడిగా మారాలని వైద్యులను సంప్రదించారు. ఇందు కోసం ఏకంగా ఏడాదికి 2M డాలర్లు(రూ.16.30కోట్లు) ఖర్చు చేస్తున్నాడు
ఇందుకోసం జాన్సన్ భారీగా ఖర్చు చేసి తన ఇంట్లో ప్రత్యేక పరికరాలతో కూడిన ల్యాబ్‌ను కూడా సిద్ధం చేశాడు.
డా.ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలోని వైద్యుల బృందం జాన్సన్ కేసును టేకప్ చేసింది. దీనికి
ప్రాజెక్ట్ బ్లూప్రింట్ అని పేరుపెట్టింది.
ప్రాజెక్ట్ బ్లూప్రింట్
జాన్సన్‌కు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నిత్యం యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని హామీ ఇచ్చింది.
రోజూ ఉదయం 5 గంటలకు జాన్సన్ దినచర్య ప్రారంభమవుతుంది.ఉదయాన్నే జాన్సన్ రెండు డజన్ల సప్లిమెంట్లు మందులు తీసుకుంటాడు.
కఠినమైన డైట్
చర్మ ఆరోగ్యానికి లైకోపీన్, ప్రేగు పాలిప్స్ నిరోధించడానికి మెట్‌ఫార్మిన్, కాలేయం పనితీరు మెరుగుకు పసుపు, నల్ల మిరియాలు, అల్లం జ్యూస్ తీసుకుంటాడు.
మెదడు ఆరోగ్యం కోసం లిథియం మైక్రోడోస్, ఆపై 25 రకాల వ్యాయామాలు చేస్తాడు
తిన్న తర్వాత, టీ-ట్రీ ఆయిల్‌తో జాన్సన్ బ్రష్ చేసుకుంటాడు
రోజంతా వేగన్ డైట్ మాత్రమే తీసుకోవాలి. అంటే జంతువు శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు.
ఇలా రోజులో 1,977 కేలరీల ఆహారం మాత్రమే తీసుకుంటారు
కొన్ని రోజుల చికిత్స తర్వాత జాన్సన్ శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా, హృదయం పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా కనిపించింది.
ఫలితాలు ఎలా ఉన్నాయి?
చర్మం నిగారింపు 28 ఏళ్ల మగవాడిలా కనిపిస్తున్నట్లు జాన్సన్ తెలిపాడు.
రాత్రిపూట అతని అంగస్థంభనలు లెక్కించేందుకు ఓ పరికరం ఏర్పాటు చేశారు. యుక్తవయసులో అతను ఎలాంటి అంగస్తంభన కలిగి ఉన్నాడో అలాంటి స్పందనలే ప్రస్తుతం కలిగి ఉన్నట్లు తేలింది.
మొత్తంగా తన వయస్సు 5 ఏళ్లు తగ్గిందని ఆశ్చర్యపోతూ జాన్సన్ చెప్పాడు
జాన్సన్ శరీరభాగాల పని తీరును ట్రాక్ చేసేందుకు నిత్యం 30 మంది వైద్యుల బృందం అతడిని పర్యవేక్షిస్తోంది
ఎప్పటి వరకు ఈ చికిత్స?
తన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, దంతాలు శరీరంలోని ప్రతీ అవయవం 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స కొనసాగిస్తానని జాన్సన్ తెలిపాడు.
ఈ ప్రయత్నం విజయవంతం అయ్యే వరకు ఏటా 2మిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కు ఖర్చు పెట్టేందుకు సిద్ధమని చెప్పాడు.
జాన్సన్ ప్రయత్నం విజయం సాధిస్తే మాత్రం సమీప భవిష్యత్తులో మనిషి ఏ వ్యాధులకు గురికాకుండా నవ యవ్వనంగా మారవచ్చు.
పరిశోధనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.