PROJECT K: ప్రాజెక్ట్ కె స్టోరీ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

YouSay Short News App

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె మూవీ నుంచి చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

మహాశివరాత్రి శుభాకంక్షలు తెలియజేస్తూ పోస్టర్‌ను ట్వీట్‌ చేసింది. పొస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

ముగ్గురు వ్యక్తులు ఏదో సిక్రెట్ మిషన్ కోసం పనిచేస్తున్నట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది.

పోస్టర్‌ను పరిశీలిస్తే అందులోని భారీ హస్తం యుద్ధానికి రండి అనే సంజ్ఞ చేస్తున్నట్లు కనిపిస్తోంది. చూట్టూ భారీ ఆయుధాలు కనిపించాయి.

ప్రాజెక్ట్ కె చిత్రం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తునట్లు సమాచారం. భవిష్యత్‌లో ప్రపంచం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని టైమ్ ట్రావెలింగ్ ద్వారా తెలపనున్నారు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్

ప్రాజెక్ట్ కె స్టోరీ ఇదేనా?

టైం ట్రావలింగ్ ద్వారా మూడో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిణాలు ఎలా ఉంటాయి? అనే యూనిక్ కథాంశంతో ఈ సినిమా వస్తోందని విశ్వసనీయంగా తెలిసింది.

ప్రాజెక్ట్ కె మూవీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ఈ సినిమా రచయిత బుర్ర సాయిమాధవ్ తెలిపారు. ఈ సినిమాను చూసిన వారు రెండు మూడు నెలలు చిత్రం తాలుకు విజువల్స్ హ్యాంగ్ ఓవర్‌లో ఉంటారని చెప్పారు.

ప్రాజెక్ట్ కె చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు ప్రాజెక్ట్ కె సినిమాలో స్టార్ నటీనటులు ఉన్నారు.  ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

దీపిక పదుకునే, దిశా పఠాని ప్రభాస్ సరస హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ తన సినీ ప్రయాణాన్ని 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా నిర్మిస్తోంది.

ప్రాజెక్ట్ కె బడ్జెట్ విషయంలో వైజయంతి  మూవీస్  ఏమాత్రం రాజీపడటం లేదు. ఈ సినిమా బడ్జెట్ రూ.500కోట్లుగా అంచనా వేశారు. కానీ సినిమా పూర్తయ్యే సరికి ఈ మొత్తం ఇంకా దాటనుంది.

భారీ బడ్జెట్