హైదరాబాద్‌లో సింగిల్స్‌కు ఎంట్రీ ఇచ్చే పబ్‌లు ఉన్నాయని తెలుసా?
పబ్‌లో ఎక్కువశాతం కపుల్స్‌కి మాత్రమే అనుమతిచ్చేవి ఉంటాయి. కానీ, సోలోగా ఎంజాయ్ చేసేందుకు కొన్నింటిలో అవకాశం ఉంది. అవెంటో చూడండి.
మాదాపూర్‌లోని టానిక్ పక్కన రివోల్ట్ పబ్ ఉంది. నగరంలో చాలాకాలంగా ఉన్నవాటిలో ఇది ఒకటి. ఇందులో స్టాగ్స్‌కు అనుమతి ఉంది. కానీ, కొన్ని వారంతాల్లోనే అనుమతిస్తారు.
రివోల్ట్
ఈ పబ్‌లో కొన్ని ప్రత్యేకతలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం, లైవ్ మ్యూజిక్ మరియు అదిరిపోయే వైన్ అందుబాటులో ఉంటుంది.
గచ్చిబౌలిలోని బఫెలో వైల్డ్ వింగ్స్‌లో సింగిల్స్‌కు ఎంట్రీ ఉంది. అదిరిపోయే ఫుడ్‌తో పాటు కాస్త మద్యం తాగి ఆనందంగా గడపాలంటే ఇక్కడికి వెళ్లవచ్చు. సిబ్బంది సేవలు, శుభ్రత మిమ్మల్ని మెప్పిస్తుంది.
బఫెలో వైల్డ్ వింగ్స్
మహానగరంలో రాత్రిలైఫ్‌ను ఎంజాయ్ చేయాలంటే హార్డ్ రాక్ కేఫ్ సూపర్ ప్లేస్. వీక్‌డేస్‌లో స్టాగ్స్‌కు ఎంట్రీ ఇచ్చే ఏకైక పబ్ ఇది. వారాంతాలతో పాటు స్పెషల్ నైట్స్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఆహ్లాద వాతావరణం, లైవ్ మ్యూజిక్, ఆహారం, బీర్ విషయంలో మంచి ప్రదేశం.
హార్డ్ రాక్ కేఫ్
స్కైహై లాంజ్ గచ్చిబౌలిలో ఉంది. ఇందులో దొరికే బీర్ చాలా ప్రత్యేకం. వారంపాటు పార్ట్‌నర్ లేకుండా వెళ్లవచ్చు. కానీ వారాంతాల్లో అస్సలు అనుమతించరు. ఇందులో లభించే కాక్‌టేల్, వంటకాలను అస్సలు మిస్ కావద్దు.
స్కైహై లాంజ్
బేగంపేటలో ఉన్న ఈ పబ్‌లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసే ప్రదేశం. సూపర్ ఎనర్జీ కలిగించే వాతావరణం, నోరూరించే వంటకాలు, మద్యం సింగిల్స్‌కు అనువైనది. వీకెండ్స్‌లో ఈ పబ్ జనంతో నిండిపోతుంది.