ws_FzCllJ5acAETijK

Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!

YouSay Short News App

ws_FzC3IlMXoAAxgPl

పూరి జగన్నాథ రథయాత్ర నేటి నుంచి 12 రోజుల పాటు జరుగుతుంది

ఏ ఆలయంలోనైనా ఉత్సవ విగ్రహాలను ఉరేగింపుగా తీసుకెళ్తారు.. కానీ పూరీలో మాత్రం మూల విరాట్టులనే బయటకు తీసుకొచ్చి ఊరేగిస్త్తారు

ws_FzB5jV7acAAwwkv

పూరీ ప్రధానాలయంలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కొలువై ఉంటాడు

రథయాత్రలో మహాలక్ష్మిని కాదని జగన్నాథుడు తన సోదరుడు, సోదరితో ఊరేగుతాడు

అన్నాచెల్లెళ్ల అనుబంధం, రక్త సంబంధం విలువను ప్రపంచానికి తెలియజేయడమే జగన్నాథుడి రథయాత్ర ముఖ్య ఉద్దేశం

రథయాత్రకు 60 రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు రథాల నిర్మాణం పనులు మొదలవుతాయి.

రథాల నిర్మాణానికి  1,072 మొక్కల కాండాలను పూరీకి తరలిస్తారు.

ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు

వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం ఉపయోగిస్తారు.

రథాల తయారీకి ఎక్కడా యంత్రాలను వాడరు.. స్వయంగా శిల్పులు రథాలను చెక్కుతారు

జగన్నాథుడి రథం పేరు నందిఘోష. దీని ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు

బలభద్రుడి రథం పేరు తాళధ్వజం, సుభద్రాదేవి రథం పేరు దేవదళన్‌

రథాలను లాగేందుకు వీలుగా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు

పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే నిత్యం జగన్నాథున్ని కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం

రథయాత్ర జరిగే 12 రోజులు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం

ఈ 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో.. రోజూ సా. 6 గంటలకు విష్ణుమూర్తి ఆలయంలో నేతితో రెండు దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran