RAHUL SIPLIGUNJ: ధూల్‌పేట్ గల్లీ నుంచి ఆస్కార్ వేదికపై లైవ్ పర్‌ఫార్మెన్స్ దాకా..!
YouSay Short News App
మాస్ పాటలకు కేరాఫ్ అడ్రస్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్. యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన
ఈ దూల్‌పేట్ కుర్రోడు ఇప్పుడు ఆస్కార్ వేదికపై పాట పాడే స్థాయికి ఎదిగాడు.
యావత్ ప్రపంచాన్ని అలరించిన RRRలోని నాటు నాటు పాటను కాళభైరవతో కలిసి పాడాడు రాహుల్. ఈ పాటకు ఆస్కార్ రావటంతో సిప్లీగంజ్ కెరీర్ మరో స్థాయికి చేరింది.
స్వయంగా పాటలు రాసుకొని వాటికి సహ నిర్మాతగా వ్యవహరించి యూట్యూబ్‌లో విడుదల చేశాడు రాహుల్ సిప్లీగంజ్. ఆ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
యూట్యూబర్
దీక్షా సేత్‌తో కలిసి తీసిన ఓ మంగమ్మ అనే పాటతో వెలుగులోకి వచ్చిన రాహుల్… మాక్కికిరికిరి సాంగ్‌తో రాష్ట్రమంతా ఊపేశాడు.
స్టార్‌డమ్
ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ హైదరాబాదీ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. పూర్ బాయ్, గల్లీ కా గణేశ్, జై భజరంగ్ వంటి పాటలతో శ్రోతలను అలరించాడు.
గల్లీ కా గణేశ్
నాగ చైతన్య హీరోగా వచ్చిన మెుదటి సినిమా జోష్‌లోని కాలేజీ బుల్లోడా ఖలేజ ఉన్నోడా పాటతో ఎంట్రీ ఇచ్చాడు రాహుల్.
సినిమా ఛాన్స్
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే కీరవాణి నేతృత్వంలో పాడాడు సిప్లీగంజ్. ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలోని వాస్తు బాగుందే పాటను పాడింది అతడే.
యం.యం.కీరవాణితో
మణిశర్మ, కీరవాణి వంటి దిగ్గజాలతో పాటు దేవీ శ్రీ ప్రసాద్, తమన్, అనూప్ రూబెన్స్, ఇమామ్, అనిరుధ్ వంటి సంగీత దర్శకత్వంలో పాటలు ఆలపించాడు.
సంగీత దర్శకులందరితో
లై చిత్రంలో బొంబాట్, రంగస్థలంలో రంగ రంగ రంగస్థలానా, చల్ మోహన్‌రంగలో పెద్ద పులి, చిత్రలహరిలో గ్లాస్ మేట్స్, ఇస్మార్ట్ శంకర్‌లో బోనాలు, A1 ఎక్స్‌ప్రెస్‌లో సింగిల్ కింగులం అనే మాస్ పాటలు బాగా అలరించాయి.
మాస్ జాతర
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో మరోసారి కీరవాణి సంగీత దర్శకత్వంలో నాటు నాటు అనే ఊరమాస్ పాటను పాడి శ్రోతల్ని మెప్పించాడు రాహుల్.
నాటు నాటు
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేస్తూ నాటు నాటు పాటి ఆస్కార్‌కు ఎంపిక కాగా.. ఆ పాటను లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కార్యక్రమంలో లైవ్‌లో పాడాడు సిప్లీగంజ్.
ఆస్కార్ వేదికపై
తెలుగులో వస్తున్న బిగ్‌బాస్‌లోకి వెళ్లి విజేతగా నిలిచాడు. మరో సింగర్ గీతా మాధురిపై విజయం సాధించాడు.
బిగ్‌బాస్ విన్నర్
ప్రస్తుతం బిజినెస్‌లోనూ రాణిస్తున్నాడు ఈ యంగ్ టాలెంటెడ్ సింగర్. ఊకో కాక పేరుతో బట్టల బ్రాండ్‌ను ప్రారంభించి బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు.
ఊకో కాక
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిసమ్ పబ్‌లో సిప్లిగంజ్‌పై దాడి జరిగింది. కొందరు బీర్ బాటిల్స్‌తో చితకబాదారు.
వివాదాలు
జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనూ పట్టుబడ్డాడు. వారికి సహకరించకుండా దుర్బాషలాడినట్లు పోలీసులు తెలిపారు.
ప్రెషర్ కుక్కర్, రామ చక్కని సీత సినిమాల్లో గెస్ట్ రోల్‌లో నటించాడు. కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ చిత్రంలో నటించాడు రాహుల్ సిప్లీగంజ్.
సినిమాలు
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.