YouSay Short News App
రకుల్, జాకీ భగ్నానీ న్యూఇయర్ వేడుకలు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
కొత్త సంవత్సరానికి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఘనంగా స్వాగతం పలికింది.
గుర్తు తెలియని ప్రదేశంలో ఆహ్లాదకరమైన బీచ్‌లు, ఖరీదైన రిసార్ట్‌ల మధ్య సెలవులను ఎంజాయ్ చేసింది ముద్దుగుమ్మ.
విలాసవంతమైన రిసార్ట్‌లో ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి న్యూఇయర్ వేడుకలు జరుపుకుంది.
గడిచిన 10 రోజులుగా బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో వరుసగా పాల్గొంటూ సరదాగా గడిపేస్తోంది ఈ అమ్మడు.
రకుల్, జాకీ భగ్నానీ 2021 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. నిర్మాతగా మారిన ఈ మాజీ నటుడు రకుల్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు టాక్.
ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కొన్ని చిత్రాలకు జాకీ సహ నిర్మాతగా వ్యవహరించాడు
రకుల్, జాకీ మధ్య విడదీయలేని బంధం ఉందట. వీరు పెళ్లి కూడా చేసుకుంటారని సినీ వర్గాలు
కోడై కూస్తున్నాయి.
రకుల్ దాదాపు 16 సంవత్సరాల పాటు పెంచుకున్న కుక్క ఇటీవల అనుకోకుండా చనిపోవడంతో ఆమె చాలా బాధపడిందట.
కెరీర్ పరంగా 2022 రకుల్‌కి ఆశించిన విధంగా లేదు. బాక్సాఫీస్ వద్ద ఆమె నటించిన సినిమాలు బోల్తా పడ్డాయి.
2023లో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని రకుల్ ఎదురుచూస్తోంది. జనవరి 20న Zee5 ఓటీటీ వేదికగా ఛత్రీవాలీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
దక్షిణాది సినిమాలను ఈ నటి పెద్దగా పట్టించుకోవటం లేదని వినికిడి. టాలీవుడ్‌లో మరోసారి మంచి చిత్రం ద్వారా తన మ్యాజిక్‌ను చూపించాలని కోరుకుందాం.