కియారా అద్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీళ్లు త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారని టాక్.
దుబాయ్‌లో న్యూఇయర్ వేడుకల్లో మునిగి తేలిన ఈ జంట పెళ్లి పనుల్లో బిజీ అయ్యారట. సంగీత్ , మెహందీ, షాపింగ్ పనులు జరుగుతున్నాయని బీ టౌన్‌లో చర్చ జరుగుతోంది.
బాలీవుడ్‌లో చాలాకాలంగా సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ ప్రేమవ్యవహారంపై చర్చ సాగుతూనే ఉంది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్న ప్రచారంపై ఇద్దరూ స్పందించలేదు.
హాట్ కపుల్
ఇద్దరు కలిసి ఎక్కువ సినిమాలు చేయకపోయినా వీరి మధ్య స్నేహం ఉండేది. షేర్షా చిత్రంతో బంధం బలపడి ప్రేమగా మారిందని సమాచారం.
పరిచయం ఎలా?
కాఫీ విత్ కరణ్ షోలో భవిష్యత్ అందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సిద్ధార్థ్ చెప్పాడు. కియారాతోనా అని కరణ్ ప్రశ్నించగా.. తనైతే ఇంకా బాగుంటుందని సమాధానం ఇవ్వడంతో కన్ఫర్మ్ చేసినట్లు అయ్యింది.
కన్ఫర్మ్ చేశారా?
కియారా, సిద్ధార్థ్ కలిసి న్యూఇయర్ దుబాయ్‌లో ఎంజాయ్ చేశారు. వీరిమధ్య బంధం గురించి రూమర్స్ మరింత బలపడ్డాయి. అక్కడ్నుంచి తిరిగి వచ్చినప్పుడు ముంబై ఎయిర్‌పోర్టులోనూ కనిపించింది యువజంట.
దుబాయ్‌లో న్యూఇయర్
ఈ యువ జంట త్వరలో పెళ్లి చేసుకుంటారని టాక్. ఫిబ్రవరి 6న ముహుర్తం కూడా ఖరారయ్యిందట. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది.
వివాహ బంధం
పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. పంజాబీ సంప్రదాయంలో మూడ్రోజులపాటు ఘనంగా వేడుక నిర్వహించనున్నారు.
పంజాబీ స్టైల్‌లో
వివాహనికి ముందు హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ధూమ్‌ధామ్‌గా జరగనున్నాయి. ఒకే రోజు రెండూ వేడుకల సందడి ఉంటుందట. షాపింగ్ కూడా ఇప్పటికే మొదలైందట.
చకచకా ఏర్పాట్లు
సిద్ధార్థ్, కియారా ఇప్పటికే సంగీత్‌లో పాటలకు సంబంధించి ప్లేలిస్ట్ కూడా సిద్ధం చేశారు. దీనిగురించి దుబాయ్‌లో న్యూఇయర్ వేడుకలప్పటి నుంచి చర్చించారని వినికిడి.
సంగీత్ సందడి
జైసల్మేర్ ప్యాలెస్‌లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తిగత భద్రత కోసం బృందాలుగా బాడీగార్డ్స్ ఫిబ్రవరి 3న ప్యాలెస్‌కు వెళ్తారని టాక్.
ప్యాలెస్‌లో భద్రత
వివాహానికి కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు చిత్రపరిశ్రమకు చెందిన పలువురుని పిలిచేందుకు లిస్ట్ కూడా సిద్ధమయ్యిందని తెలుస్తోంది. ఇందులో కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, నిర్మాత అశ్వీని యార్డీ వంటి సన్నిహితులు ఉన్నారు.
పెళ్లి పిలుపు
రాజస్థాన్‌లో పెళ్లి వేడుక పూర్తైన తర్వాత ముంబైలో ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారని సమచారం. సిద్ధార్థ్ ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నాడని తెలుస్తోంది.