YouSay Short News App

Ram Charan:  మాల విరమించిన రామ్‌చరణ్.. GMA టాక్ షోలో రాజమౌలిపై ప్రశంసలు

ఆస్కార్ అవార్డుల కోసం అమెరికా పయనమైన మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ వివిధ వేడుకల్లో పాల్గొంటున్నాడు.

పాపులర్ అమెరికన్ టాక్ షో ‘గుడ్‌మార్నింగ్ అమెరికా 3’లో పాల్గొని తెలుగు ఖ్యాతిని మరింత పెంచాడు. న్యూయార్క్‌లో చెర్రీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ప్రఖ్యాత ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ టాక్ షోలో ఒక తెలుగు నటుడు పాల్గొనడం అందరికీ గర్వకారణం.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి రామ్‌చరణ్  ఈ టాక్ షోలో వివరించాడు. ఇది ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ మాత్రమే కాదని, భారతీయ సినిమా విజయమని చెర్రీ కొనియాడాడు.

ఇండియన్ స్పీల్‌బర్గ్‌గా దర్శకధీరుడు రాజమౌళిని పిలుస్తామని చరణ్ వెల్లడించాడు. తన స్టోరీ రైటింగ్‌తో గ్లోబల్ సినిమా ఖ్యాతిని తీసుకొచ్చాడని కొనియాడాడు.

అమెరికాకు రామ్‌చరణ్ మాలధారిగా వెళ్లాడు. అంతకుముందే అయ్యప్ప దీక్షను చెర్రీ స్వీకరించాడు.

తాజాగా సూట్ వేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో అయ్యప్ప దీక్ష గురించి సందేహాలు వెల్లువెత్తాయి.

దీక్ష స్వీకరించి 21 రోజులు పూర్తైనందున అమెరికాలోని ఓ ఆలయంలో రామ్‌చరణ్ అయ్యప్ప దీక్షను విరమించినట్లు సమాచారం.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి చెర్రీ ప్రజెంటర్‌గా హాజరు కానున్నాడు.

వివిధ ఈవెంట్లతో రామ్‌చరణ్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇటీవల న్యూయార్క్‌లో ఫ్యాన్స్‌తో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌కు రామ్‌చరణ్ ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యాడు. తారక్ కూడా ఈ రేసులో నిలిచాడు.

టామ్ క్రూస్, నికోలస్ కేజ్, బ్రాడ్ పిట్ వంటి హేమాహేమీలతో ‘క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్’ కోసం చెర్రీ, ఎన్టీఆర్ పోటీపడుతుండటం విశేషం.