నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏదో ఒక రూపంలో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి రష్మిక డ్రెస్సింగ్ స్టైల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
జీ సినిమా అవార్డ్స్ కార్యక్రమానికి బ్లాక్ ఓపెన్ గౌను ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది నేషనల్ క్రష్. అయితే, ఈ డ్రెస్సింగ్‌పై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.
జీ సినిమా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని అందాల ప్రదర్శన చేసింది. ఒక అవార్డు కూడా సొంతం చేసుకున్నట్లు ‘పుష్ప’ బ్యూటీ ఇన్‌స్టాలో పంచుకుంది.
నెట్టింట్లో రచ్చ
రష్మిక డ్రెస్‌ను చూసిన నెటిజన్లు.. బాలీవుడ్ గాలి బాగా సోకిందంటూ కామెంట్ చేస్తున్నారు. అక్కడి సినిమాల్లో నటిస్తూ.. బీ టౌన్ భామల కంటే అధికంగా స్కిన్ షో చేయడానికి ట్రై చేస్తోందంటూ పోస్ట్ చేస్తున్నారు.
జీ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరై రష్మిక ట్రోలింగ్‌ని ఎదుర్కొంటోంది. బుల్లి బ్లాక్ ఓపెన్ గౌను వేసుకొని కెమెరా ముందుకొచ్చాక కాస్త సర్దుబాటు చేసుకుంది. దీంతో ఇలాంటి డ్రెస్ వేసుకోవడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
టాక్ ఆఫ్ ది టౌన్
సంక్రాంతికి విడుదలైన ‘వారసుడు’లో రష్మిక మెరిసింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో రష్మిక మళ్ళీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
బాలీవుడ్‌లో విడుదలైన ‘మిషన్ మజ్ను’ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఈ బ్యూటీ ఆశలన్నీ ఇప్పుడు ‘పుష్ప2’ సినిమాపైనే ఉన్నాయి.
విజయ్ దేవరకొండతో స్నేహంగా మెలగడం వల్ల కూడా రష్మిక తరచూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు తెగ పుకార్లు పుట్టుకొస్తున్నాయి.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఈ శాండిల్‌వుడ్ బ్యూటీ గ్లామర్ డోస్ అమాంతం పెంచింది. తరచూ హాట్ ఫొటో షూట్లలో పాల్గొంటూ కైపెక్కిస్తోంది.
ఇటీవల రష్మిక… సౌత్, బాలీవుడ్ సినిమాలను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో దక్షిణాది ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి