వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ క్రాక్‌తో హిట్ ట్రాక్ ఎక్కాడని అంతా అనుకున్నారు. కానీ, ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో పరాజయాలు ఎదుర్కొన్నాడు. మాస్ మహా రాజా నుంచి కొత్త సినిమాలు రావటం లేదని అభిమానుల అభిప్రాయం.
ఇలాంటి తరుణంలో సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ వంటి హిట్స్ ఇచ్చిన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో రవితేజ అంచనాలు అందుకున్నాడా ? అభిమానులను మెప్పించాడో లేదో చూద్దాం.
ఓ వ్యక్తి వ్యాపార సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు కొందరు ఎలా ప్రయత్నించారు. వీరిని హీరో ఎలా తన ఎత్తుగడలతో బోల్తా కొట్టించాడనేది కథ. ఇందులో రవితేజ రెండు పాత్రల్లో నటించారు. వ్యాపారి కుమారుడిగా, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అలరించారు.
కథ
ఇలాంటి జోనర్‌లో కథలు బాగానే వచ్చాయి. చెప్పటానికి పెద్దగా స్టోరీ ఉండదు. కానీ, దీనికి మెరుగులు దిద్దేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. పాత కథకు ట్విస్ట్‌లు జోడించినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్ మెుత్తం కామెడీ సీన్లతో, కొన్ని ట్విస్ట్‌లతో నింపేశారు.
కామెడీ ఫస్టాఫ్
అయినా కొందరికి రొటీన్ అనిపించవచ్చు. రవితేజ కామెడీని ఇప్పటికే అంతకన్నా ఎక్కువ చూసేశాం అనేవారు కూడా ఉంటారు.
ఫస్టాఫ్ పాత్రల పరిచయం, కామెడీ ట్రాక్స్‌తో లాగించిన దర్శకుడు ఇంటర్వెల్‌లో ట్విస్ట్‌ను ఇచ్చి ప్రేక్షకులకు కాస్త ఊరట కలిగిస్తాడు. ఇంటర్వెల్ సగటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్
సినిమా మెుత్తం సెకండాఫ్‌లోనే ఉంటుంది. ఇక్కడ వేగం పెంచేందుకు దర్శకుడు ప్రయత్నించాడు.
ప్రీ క్లైమాక్స్ వరకు చకచకా నడిపించారు.
అసలు సినిమా
హీరో, విలన్‌కు మధ్య ఎత్తులు, పైఎత్తులతో ముందుకు వెళ్తుంది. రవితేజ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. అక్కడక్కడ ముందే సన్నివేశాలను ఊహించవచ్చు.
చిత్రంలో రవితేజ లుక్స్ బాగున్నాయి. రెండు పాత్రల్లో నటించడం సవాలుతో కూడుకున్నప్పటికీ అదరగొట్టాడు. శ్రీలీలకు, రవితేజకు మధ్య గ్యాప్ బాగా ఉన్నా సినిమాలో కనిపించకుండా జాగ్రత్త పడటంలో చిత్రబృందం సక్సెస్ అయ్యింది. ఇద్దరి డాన్స్ బాగుంది.
రవితేజ, శ్రీలీల
సినిమా థియేటర్లకు వచ్చే కన్నా ముందు విడుదలైన పాటలకు మంచి బజ్ వచ్చింది. థియేటర్లలోనూ ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. జింతాకా, దండకడియాల్ పాటలు విజిల్స్ కొట్టిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
బీమ్స్ మ్యాజిక్
సినిమా చూపిస్త మామ, నేను లోకల్ సినిమాల దర్శకుడు త్రినాథరావు నక్కిన మరోసారి కమర్షియల్ ఫార్ములానే ఎంచుకున్నాడు. రొటిన్ కథను తీసుకోవటం మైనస్. పూర్తిగా రవితేజ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించారని అనిపిస్తుంది.
దర్శకత్వం
సంగీతంకామెడీరవితేజ నటన
ప్లస్ పాయింట్స్
రొటీన్ కథఊహించే సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రేటింగ్: 2.5 / 5
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.