కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకోవడంలో నయనతార దిట్ట. మయూరి దగ్గర్నుంచి మెుదలుకొని నిజల్, నేత్రికన్, O2 వంటి చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను మెప్పించారు. తనదైన అద్భుతమైన నటనతో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు మాట్లాడేలా చేస్తుంటారు.
ఇప్ఫుడు మరోసారి అదేబాటలో కనెక్ట్ అనే చిత్రంతో అలంరించేందుకు వచ్చేసింది. మాయ, గేమ్ ఓవర్ వంటి థ్రిలర్స్‌ను అందించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వ మాయాజాలం, విజ్ఞేశ్ శివన్ నిర్మించిన “కనెక్ట్” చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుకుందామా?
ఓ అందమైన కుటుంబం. అనుకోకుండా ప్రమాదం. తండ్రిపై కుమార్తెకు ఉన్న ప్రేమ. అతడి ఆత్మ దగ్గరకు వెళ్లటమే ఆమె లక్ష్యం. ప్రయత్నం బెడిసి కొట్టి యువతిని కాపాడుకునేందుకు తల్లి చేసిన సాహసాలు. ఇదే కనెక్ట్ సినిమా కథ
కథ
ఆత్మల కోణంలో సాగే ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పాత్రల పరిచయం త్వరత్వరగా పూర్తి చేసిన దర్శకుడు కథలో లీనం చేస్తాడు. ప్రతి సన్నివేశం మన చుట్టూ జరుగుతుందేమో అనేలా తీర్చిదిద్దారు.
ఎలా ఉంది?
లాక్‌డౌన్ నేపథ్యంలో సాగిన కథ కావడంతో..ఆన్‌లైన్‌లోనే దెయ్యాన్ని వదలగొట్టడం వంటి సీన్లు కొంచెం కొత్తగా ఉంటాయి. చివర్లో కాస్త నిరాశగా అనిపిస్తుంది. అప్పటిదాకా సినిమా ఆసక్తిగా సాగినా..మంచి క్లైమాక్స్ ఉంటే బాగుండని అభిప్రాయం కలుగుతుంది.
సినిమాలో కథ పాతదే. చాలాకాలంగా మనకు ఇలాంటి కథలతో చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ, ఇక్కడే దర్శకుడి ప్రతిభ బయటపడుద్ది. కనెక్ట్ సినిమా స్క్రీన్ ప్లేను అశ్విన్ శరవణన్ అద్భుతంగా రాశాడు. గ్రిప్పింగ్ కథనంతో ప్రతి సన్నివేశంలో మనల్ని హర్రర్‌తో భయపెడతాడు.
స్క్రీన్‌ప్లే సూపర్
సినిమా మెుత్తం నయనతార, హనియా నఫీస్ షో అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరూ నటనలో ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికే నయనతార నిరూపించుకున్నా మరోసారి తనదైన శైలిలో మెప్పించింది. తల్లి పాత్రను సమర్థవంతంగా పోషించింది. నయన్ తండ్రి పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయాడు.
నయన్, హనియా నఫీస్ షో
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో మెుట్టమెుదటి సారి ఇంటర్వెల్ లేకుండా సినిమా తెరకెక్కించారు. 90 నిమిషాలు అంతక్నా కొద్దిపాటి నిడివి మాత్రమే ఉంది.
ఇంటర్వెల్ లేదు
ఇది ప్రేక్షకులకు వింత అనుభవం కలిగించినా.అప్పటికే కథలో లీనమైన ఆడియన్స్‌ను పూర్తిగా సీట్లకే అంకితం చేయడంతో త్వరగా అయిపోయిందని ఫీలింగ్ స్తుంది.
కనెక్ట్ చిత్రానికి ప్రాణం పోసింది అంటే సినిమాటోగ్రఫీ, బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ అని బల్లగుద్ది చెప్పాలి. ఎందుకంటే ప్రతి సీన్‌లో ఏదో జరుగుతుందని అనిపించేలా చేశాడు. పూర్తిగా నైట్ మోడ్‌లో తీయటం ఓ ప్లస్ పాయింట్.
సాంకేతిక పనితీరు
హార్రర్ జోనర్ చిత్రాలు చూసే ప్రేక్షకులకు ఇంది ఓ మంచి సినిమా. కచ్చితంగా వాళ్లందరూ చూస్తారు. మేమంతా సినిమా లవర్స్ కాదు అడపాదడపా చూస్తాం అనుకునే వారిని కూడా మెప్పిస్తుంది. కానీ, మీరు ఆశించినస్థాయిలో ఉండకపోవచ్చు.
ఆశపడినా దొరకదు.
నయన్ , హనియా నఫీస్ యాక్టింగ్BGM, సినిమాటోగ్రఫీస్క్రీన్ ప్లే
ప్లస్ పాయింట్స్
ఊహించిన కథ
మైనస్ పాయింట్స్
రేటింగ్: 2.75 / 5
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.