చాలారోజుల తర్వాత హాస్యనటుడు బ్రహ్మానందం పూర్తిస్థాయి నటన. రాజశేఖర్ కుమార్తె శివాత్మిక అదృష్టానికి మరో పరీక్ష. ఛాయ్ బిస్కెట్‌తో పరిచయమైన దివ్యవాణి, దివ్య శ్రీపాద వంటివారు నటులుగా నిరూపించుకోవాలనే తపన.
హీరోయిన్ స్వాతీ రీ ఎంట్రీ. ఇలా ఎంతో మంది
ఓ సినిమా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
అదే పంచతంత్రం. మరీ వీరందరి కలలు సాకారమయ్యాయో లేదో చూద్దాం.
కెరీర్‌ను లేట్ వయసూలోనూ కొనసాగించవచ్చనే బ్రహ్మనందం, 60 ఏళ్ల వయసులో స్టోరీ టెల్లింగ్ పోటీలకు వెళుతుంటాడు. యువతతో పోటీ పడేందుకు ఓ కాన్సెప్ట్ ను రూపొందిస్తాడు. అతడు చెప్పే ఐదు కథల సమాహారమే ఈ పంచతంత్రం.
కథ
బ్రహ్మానందంను వేదవ్యాస్ అనే పాత్రలో పరిచయం చేసిన దర్శకుడు సాఫ్ట్‌వేర్ యువకుడి అంతర్గతాన్ని చెప్పేందుకు మెుదటి కథ చెబుతుంటాడు.
ఈ ఎపిసోడ్‌లో వచ్చే సన్నివేశాలన్నీ పేలవంగా ఉన్నాయి.
పరిచయం
సినిమా కాసేపు బోర్ కొట్టిచ్చినా రెండో కథ నుంచి వేగం పెరుగుతుంది. రాహుల్ విజయ్, శివాత్మిక ప్రేమ కథ అందరినీ కట్టిపడేస్తుంది., ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటుంది.
కథనంలో వేగం
కన్నవారిపై తల్లిదండ్రుల ఆందోళన ఎంతలా ఉంటుందో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. దీన్ని మూడో కథలో చెప్పేందుకు ప్రయత్నించారు. ఇందులో భావోద్వేగానికి గురిచేస్తాయి.
భావోద్వేగాలు
శేఖర్, దేవిల ప్రపంచాన్ని మరో కథగా దర్శకుడు ఆవిష్కరించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కలిసి ఉండాలనే విషయాన్ని సున్నితంగా మనసులకు హత్తు కునేలా చూపించాడు.
కలిసుంటేనే కలదు సుఖం
ఇందులో భావోద్వేగం, రొమాంటిక్, డ్రామా ఇలా అన్నింటికి ప్రాధాన్యామిచ్చి కథను నడిపించారు. ఇందులో ఉత్తేజ్, చిన్నపాప నటన బాగుంది.
ఐదో కథ
ప్రతి కథను ఒక విభిన్నమైన అంశానికి ముడిపెట్టారు. పంచేంద్రియాలు చూసే రుచి, వాసన, చూపు, ధ్వని, స్పర్శ వంటి వాటితో కనెక్ట్ చేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రత్యేక ఆకర్షణ
కామెడీ అంటే గుర్తొచ్చే బ్రహ్మానందాన్ని పూర్తిగా విభిన్నంగా చూపించారు. ఇలాంటి పాత్రలు కూడా చేయగలనని బ్రహ్మీ గుర్తు చేశారు.
ఎవరు ఎలా
దొరసానితో గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక పంచతంత్రంలోనే మంచి రోల్‌లో మెరిశారు. ఆమె ఎపిసోడ్ గుర్తుండిపోతుంది. స్వాతి, దివ్యవాణి, దివ్య శ్రీపాద పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.
సంగీత దర్శకులు నేపథ్యం సంగీతాన్ని బాగా అందించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు బాగున్నాయి.
సాంకేతిక పనితీరు
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కథలు ఉంటాయి. ఎప్పుడైనా తెరపై చూసినప్పుడు ఇది మన కథే అనిపిస్తుంది. ఈ సినిమా కూడా అంతే. ఏదో ఒక కథ కచ్చితంగా మనదై ఉంటుంది.
సినిమా చూడొచ్చా లేదా ?
కథకథనంనటీనటులు
ప్లస్
ఆరంభ సన్నివేశాలు
మైనస్
రేటింగ్: 3/5
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.