REVIEW: కోనసీమ థగ్స్‌

YouSay Short News App

దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్‌ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్‌’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై ఆసక్తి పెంచాయి.

ప్రముఖ బ్యానర్‌ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం.

దర్శకత్వం     : బృందా గోపాల్‌ సంగీతం       : సామ్‌ CS నటీనటులు    : హ్రిదు హరూన్‌, అనస్వర రాజన్‌,                 బాబీ సింహా తదితరులు ఎడిటర్‌       : ప్రవీణ్‌ ఆంటోనీ సినిమాటోగ్రఫీ : ప్రియేష్‌ గురుస్వామి

చిత్రబృందం

శేషు( హ్రిదు హరూన్‌) అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు. అక్కడ దొర( బాబీ సింహా), మధు అనే ఇద్దరిని కలుసుకుంటాడు. వీరు ముగ్గురు జైలు నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తారు. శేషు అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.

కథ

శేషు జైలుకు వెళ్లేందుకు కారణమైన పెద్దిరెడ్డి కథేంటి?. దొర ఎవరు? వీరు జైలు నుంచి విజయవంతంగా తప్పించుకున్నారా? అనేదే కథ.

దర్శకురాలు బృందా మంచి కథను ఎంచుకున్నారు కానీ దానిని అంతే గొప్పగా అమలు చేయలేకపోయారు. ఫస్టాఫ్‌ చాలా నెమ్మదిగా నడుస్తుంది. పాత్రల పరిచయం, శేషు, దొర జైలుకు ఎందుకు వెళ్లారు? అనే విషయాన్ని చెప్పేందుకే ఫస్టాఫ్‌ మొత్తం పోయింది.

ఎలా ఉందంటే

అయితే ఫస్టాఫ్‌లోనూ జైలు పరిసరాలు, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్‌ చక్కగా సెట్‌ చేశారు. సెంకడాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది.

సెంకడాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. సీరియస్ నోట్‌లో సినిమా పరుగెడుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో బృందం వేసే ప్లాన్లు, వాటిని చూపించిన విధానం బాగుంది.

సహజంగా కనిపించేలా చూపడంలో దర్శకత్వం విభాగం విజయవంతమైందనే చెప్పాలి. వెట్రిమారన్‌ సినిమాలను తలపించేలా సీన్లు చాలా సహజంగా ఉంటాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా కథపైనే దృష్టిపెట్టిన దర్శకురాలిని మెచ్చుకోవాల్సిందే.

సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ప్రియేష్‌ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారింది. సినిమా సహజంగా అనిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది.  ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సామ్ సీఎస్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో చాలా సీన్లకు హైప్‌ తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి.

సాంకేతికంగా

హ్రిదు హరూన్‌ శేషుగా అదరగొట్టాడనే చెప్పాలి. ఇంటెన్సివ్ సీన్స్‌లో తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా బాగానే చేశాడు. ఫైట్లు, జైలు నుంచి ఎస్కేప్‌ సీన్లలో నటనలో సహజత్వం కనిపిస్తుంది.

నటీ,నటుల పెర్ఫార్మెన్స్

బాబీ సింహాకు ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఎప్పటిలాగే తన పాత్రలో జీవించాడు. ఎప్పటిలాగే పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌తో సూపర్‌ అనిపించుకున్నాడు. హీరోయిన్‌ అనస్వర రాజన్‌ పాత్రకు అంత నిడివి లేదు కానీ ఉన్నంత మేరలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

ఫస్టాఫ్‌ కథనం

బలహీనతలు

కథ, సెకండాఫ్‌ నటీ నటుల పెర్ఫార్మెన్స్‌ సినిమాటోగ్రఫీ బీజీఎం

బలాలు

రేటింగ్‌: 2.75

ఓవరాల్‌గా సినిమా లవర్స్‌కు ఈ వారం ‘కోనసీమ థగ్స్‌’ చూడదగ్గ సినిమా. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా,బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్  ఆ నిరాశను పోగొడుతుంది.

సమీక్ష

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.