మంచి ఎనర్జీ ఉన్న నటుడైనా బ్లాక్‌బస్టర్ కోసం సందీప్ కిషన్ ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. అలాంటి సమయంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాతో గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి అగ్ర తారాగణంతో పాన్ ఇండియా సినిమా ‘మైఖేల్’ పడింది.
ట్రైలర్ గ్రిప్పింగ్‌గా ఉండటం, అగ్ర నటులు ఉండటంతో సినిమాపై జనాల్లో ఆసక్తినైతే రేకెత్తించగలిగారు. మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మైఖేల్’ అంచనాలను అందుకుందా?. సందీప్ కిషన్‌కు బ్లాక్‌బస్టర్ అందించిందా? రివ్యూలో చూద్దాం.
చిన్నప్పటి నుంచి ఓ గ్యాంగ్‌స్టర్ దగ్గర పెరిగిన హీరో ఓ లక్ష్యం కోసం పనిచేస్తుంటాడు. అలాగే తనను పెంచిన గ్యాంగ్‌స్టర్ గురుకు అండగా ఉంటాడు. కానీ గురుపై ఓ అటాక్ జరిగిన తర్వాత హీరో కథ మారిపోతుంది. అటాక్ చేసిన వారిని కనిపెట్టే క్రమంలో తిరిగే మలుపులతో కథ సాగుతుంది.
కథేంటి?
మైఖేల్ పక్కా గ్యాంగ్‌స్టర్ మూవీ. దర్శకుడు రంజిత్ స్టైలిష్‌గా తెరకెక్కించాడు. కానీ కథ, కథనంపై కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సినిమా చాలా వరకు ప్రేక్షకుడు ఊహించినట్టుగానేే సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అంత గొప్పగా లేదు.
ఎలా ఉంది?
గ్యాంగ్‌స్టర్ మూవీస్‌కు కావాల్సినంత పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌ప్లే లేదు. అలాగే భారీ తారాగణాన్ని తీసుకుని వారికి అంత బరువైన పాత్రలు ఇవ్వలేకపోయారు. సీరియస్ నోట్‌లో సినిమా మొత్తం నడుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా ఉండవు.
సందీప్ కిషన్ తన కెరీర్ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. తన బాడీ పాత్రకు చాలా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌లో సందీప్ నిజంగా ఆకట్టుకున్నాడు.
నటీ నటుల పెర్ఫార్మెన్స్
సందీప్ కిషన్:
గౌతమ్ మీనన్ తన పాత్ర పరిధిమేరకు అదరగొట్టారనే చెప్పారు. ఆయన స్క్రీన్‌ప్రెజెన్స్‌కే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ సినిమాలో కూడా స్టైలిష్‌గా ఉండే ఆయన మాట, డైలాగ్స్ ఫ్యాన్స్‌కు నచ్చుతాయి.
విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలకు వారి స్థాయికి తగ్గ ప్రాధాన్యత లేదు. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ బాగా చేసింది. అనసూయ భరద్వాజ్ కూడా ఓకే అనిపించారు.
కథ, కథనం వీక్‌గా ఉన్నా.. సాంకేతికంగా సినిమాను బలంగా ఉంది. స్కీన్ రిచ్‌గా కనిపిస్తుంది. కిరణ్ కౌషిక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సామ్ సీఎస్ మ్యూజిక్ ఓకే అన్నట్టున్నా BGM మాత్రం చాలా సీన్లలో బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా చేయాల్సింది. నిర్మాణ పరంగా సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.
గ్యాంగ్‌స్టర్ మూవీస్ ఇష్టపడేవారికి సినిమా నచ్చుతుంది. కానీ కథ,కథనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. విజవల్స్, బీజీఎం మాత్రం బాగుంటాయి. వీకెండ్‌లో ఓ సారి చూడొచ్చు.
చూడొచ్చా?
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.