REVIEW: తమన్నా, సత్యదేవ్‌ ‘గుర్తుందా శీతాకాలం’

YouSay Short News App

కన్నడ సినిమా ‘లవ్‌ మాక్‌టెయిల్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్‌ దర్శకత్వం, కాలభైరవ సంగీతం, సత్యదేవ్‌, తమన్నా ప్రధాన తారాగణంగా తెలుగులో వచ్చింది.

మరి కన్నడ సూపర్‌హిట్‌ అయిన ఈ సినిమా తెలుగులో వర్కవుట్ అయిందా చూద్దాం

ఓ జర్నీలో పరిచయమైన అమ్మాయితో హీరో తన గత లవ్‌స్టోరీలను ఫ్లాష్‌బ్యాక్‌లో చెబుతుంటాడు. అయితే తనకు పెళ్లయిన తర్వాత సాఫీగా సాగుతున్న జీవితంలో వచ్చిన పెను తుపాను, ఎమోషనల్‌ జర్నీ ఏంటనేది సినిమాలో చూడాలి.

స్టోరీ:

దర్శకుడు కన్నడ సినిమా కథ, స్క్రీన్‌ప్లేను ఏమాత్రం మార్చకుండా తీశాడు. నెమ్మదిగా సాగుతుంది కానీ కొందరికి నచ్చొచ్చు. తమన్నాతో మినహా ఇతర హీరోయిన్లతో ఉన్న సీన్లు అంత కనెక్టింగ్‌గా అనిపించవు. సినిమా విషాదాంతంగా ముగియడం కొందరికి రుచించకపోవచ్చు

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం

సత్యదేవ్‌ ఎప్పటిలాగే ప్రాణం పెట్టి చేశాడు. మీసాలు గడ్డం లేకుండా యూత్‌గా కనిపించే క్యారెక్టర్లలో అంతగా పొసగినట్లు అనిపించలేదు

సత్యదేవ్‌

తమన్నా కాస్త డీగ్లామరస్‌గా కనిపిస్తుంది కాస్త అమాయకత్వం, అమితమైన ప్రేమ ఉన్న పాత్రలో తాను ఒదిగిపోయి చేసింది

తమన్నా

సత్యదేవ్‌, తమన్నా మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. పెళ్లయిన తర్వాత ఉండే సీన్లు రొమాంటిక్‌గా అనిపిస్తాయి

కెమిస్ట్రీ

కాలభైరవ సంగీతం చాలా సాధారణంగా ఉంది. ఇలాంటి సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, పాటలే మనల్ని కట్టిపడేస్తాయి. కానీ ఇందులో సంగీతం అంత అద్భుతంగా లేదు.

సంగీతం

సాంకేతికంగా సినిమా చాలా రిచ్‌గా ఉంటుంది. సిినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ కూడా ఓకే. కెమెరా పనితీరు బాగుంది

సాంకేతికంగా

నటీ నటులు కథ

బలాలు

రీమేక్‌ కావడం సంగీతం అంత గొప్పగా లేకపోవడం

బలహీనతలు

రేటింగ్  2.5/5

మీరు కన్నడ ‘లవ్‌ మాక్‌టెయిల్‌’ చూసి ఉండకపోతే, విషాదాంతాలను ఇష్టపడే వారైతే  ఈ సినిమా చూడొచ్చు

చివరిగా..

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.