రిచా చద్దా ట్వీట్‌ కాంట్రవర్సీ ఎవరెవరు ఏమన్నారు?

బాలివుడ్‌లో సినిమాలు, సిరీస్‌లో మంచి పేరు తెచ్చుకున్న బ్యూటీ రీచా చద్దా. ‘గ్యాంగ్స్‌ ఆఫ్ వసేపూర్‌’లో ఫిల్మ్‌ ఫేర్‌ కూడా గెలుచుకున్న ఈ నటి ఇటీవల ఓ ట్వీట్‌తో వార్తలకెక్కి, తీవ్ర విమర్శలపాలవుతోంది.

ఓ సీనియర్‌ ఆర్మీ అధికారి, ‘POKను స్వాధీనం చేసుకునేందుకు ఆర్మీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కేంద్రం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. వారికి గట్టి సమాధానం ఇస్తాం’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘ గల్వాన్‌ హాయ్‌ చెబుతోంది’ అంటూ రిచా చద్దా ట్వీట్‌ చేసింది.

రిచా ట్వీట్‌పై నెజిటన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దేశం కోసం పోరాడే ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా, వారి సాహసాలు, త్యాగాలను అవమానించేలా మాట్లాడుతోందంటూ మండిపడ్డారు. సెలబ్రెటీలు కూడా దీనిపై స్పందించారు.

“దేశ రక్షణ కోసం గల్వాన్‌ దాడుల్లో 20 మంది భారత  సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను స్మరించుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. రాజకీయాలు మర్చిపోండి. మన దేశ ఆర్మీని ఎప్పుడూ గౌరవించాలి. అమానించకూడదు. రిచా దయచేసి గౌరవించండి. దేశం తర్వాతే ఏదైనా అని తెలుసుకోండి’’

నిఖిల్‌

“ఆమెకు ఏమైంది? అసలు అలా ఎలా ఆలోచించగలరు? సైనిక బలగాలను మనమంతా గౌరవించాలి. దేశం పట్ల వారి అసామాన్య సేవలనైనా గుర్తించాలి. కృతజ్ఞతాభావం లేని ఇలాంటి వారిని చూస్తుంటే బాధగా ఉంది”

మంచు విష్ణు

“కొంతమందిలో పాపులారిటీ కోసం దేశానికి కీడు చేయడం పిరికవాళ్ల పని. సైన్యం గౌరవాన్ని దెబ్బతీయడం కంటే సిగ్గుచేటు పని ఇంకోటి ఉంటుందా”

అనుపమ్ ఖేర్‌

“ఆర్మీ దుస్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలను సరిహద్దులో అడ్డుపెట్టి దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నారు. మనం వారికి ఇవ్వగలిగేది కేవలం మన మనసుల్లో ప్రేమ, గౌరవం, కృతజ్ఞత ఉంచుకోవడం. జైహింద్‌”

Kay kay  మీనన్‌

“ ఈ ప్రవర్తన పట్ల నేను ఏమాత్రం ఆశ్చర్యపోవడం లేదు. వాళ్లు నిజంగానే దేశ వ్యతిరేక భావనలు కలిగిఉన్నవారు. మనసులోని మాట పెదాలపైకి వచ్చే తీరుతుంది కదా. మళ్లీ వారే బాలివుడ్‌ను ఎందుకు బాయ్‌కాట్‌ చేయమంటున్నారని అడుగుతారు. సిగ్గు చేటు”

వివేక్‌ అగ్నిహోత్రి (కశ్మీరీ ఫైల్స్‌)

“ఇలాంటివి చూడటం బాధగా ఉంది. ఎటువంటి కారణమైన ఆర్మీ పట్ల మన కృతజ్ఞతా భావాన్ని తగ్గించకూడదు. వారు ఉన్నారు కాబట్టే ఇవాళ మనం ఉన్నాం”

అక్షయ్‌ కుమార్‌

రిచా చడ్డాకు మద్దతుగా ప్రకాశ్‌ రాజ్‌ నిలిచారు. అక్షయ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ ‘మీ నుంచి ఇది ఊహించలేదు అక్షయ్‌. మీకన్నా రిచానే ఈ దేశ ఆర్మీతో దగ్గరి సంబంధం కలిగి ఉంది’ అని ట్వీట్‌ చేశారు.

ప్రకాశ్‌ రాజ్‌

BOYCOTT FUKREY3, BOYCOTT BOLLYWOOD అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు.  మీ మాటలకు సిగ్గుపడండి అంటూ రిచా చడ్డాపై కామెంట్ల వర్షం కురిపించారు.

నెటిజన్స్‌

ట్వీట్‌పై రీచా క్షమాపణ చెప్పింది. “ నేను ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా, నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణ కోరుతున్నా. నా సొంత నానాజీ సైన్యంలో పనిచేశారు.

రిచా క్షమాపణ

ఇండో-చైనావార్‌లో బుల్లెట్‌ దెబ్బలు తిన్నారు. మా మామాజీ ఒక పారాట్రూపర్‌. దేశభక్తి నా రక్తంలోనే ఉంది. ఒక సైనికుడి ప్రాణం పోతే వారి కుటుంబం మొత్తం ఎంత బాధలో ఉంటుందో నాకు తెలుసు.” అంటూ ట్వీట్‌ చేసింది.