Rishabh Pant: రిషబ్ పంత్ కెరీర్ ప్రమాదంలో పడినట్లేనా?
YouSay Short News App
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడటం యావత్ క్రిడాభిమానుల హృదయాల్ని కలచివేస్తోంది.
నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి రిషబ్ పంత్ దిల్లీలోని బంధువుల ఇంటికి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.
ప్రమాదం
ఈ ప్రమాదంలో పంత్ కుడి మోకాలికి తీవ్ర గాయామైంది. నుదుటిపై రెండు కాట్లు పడ్డాయి. పాదం, బొటనవేలుకు గాయమైనట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
గాయాలు
రిషబ్‌కు తగిలిన గాయాల తీవ్రతను బట్టి విశ్లేషిస్తే.. కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టైం పట్టొచ్చు
టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో.. ఇలా అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతి కొద్దిమంది ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడు. కోలుకున్న అనంతరం తిరిగి 3 ఫార్మాట్లలోనూ ఆడగలడేమో చూడాలి.
3 ఫార్మాట్లలో ఆడతాడా?
ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన పంత్ అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడు. కానీ, ఈ మధ్యే పంత్ ప్రదర్శన గాడితప్పింది. తిరిగి లయ అందుకుంటాడా అన్నది వేచి చూడాలి.
లయ అందుకుంటాడా?
శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు పంత్‌ను బీసీసీఐ పక్కన పెట్టింది. రిషబ్ పంత్ ఫామ్ కోల్పోవడమే ఇందుకు కారణమై ఉంటుందని చెబుతున్నారు.
లంక సిరీస్‌కు దూరం
2023 ఫిబ్రవరిలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌కు రిషబ్ పంత్ తప్పకుండా తిరిగి జట్టులోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. ఆసీస్‌పై రిషబ్ పంత్‌కున్న ట్రాక్ రికార్డు అలాంటిది.
ఆసీస్ సిరీస్ కష్టమే
దూకుడైన ఆటతీరు పంత్‌కు టెస్టు మ్యాచుల్లో కలిసొచ్చింది. కానీ, ఇదే శైలి వన్డే, టీ20ల్లో పంత్‌ని అభాసుపాలు చేసింది. కోలుకున్నాక ఎలా ఆడతానడేది సందేహాస్పదం.
దూకుడు ఉంటుందా?
ఐపీఎల్‌లో పంత్ దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. మార్చిలో ఐపీఎల్ మొదలు కానుంది. ఆలోపు పంత్ కోలుకుంటాడా అన్నది సందేహమే.
ఐపీఎల్ ఆడతాడా?
పంత్‌కే కాకుండా.. భారత జట్టుకు కూడా ఇది లోటే. 2023లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలో కీలక ఆటగాడైన పంత్ లేకపోవడం జట్టు బలాన్ని తగ్గిస్తుంది.
జట్టుకు లోటు
టీమిండియా జాతీయ జట్టులో స్థానం కోసం ఇప్పటికే విపరీతమైన పోటీ నెలకొంది. ముఖ్యమైన టోర్నీల్లో జట్టు విఫలమవ్వడం కూడా ఆటగాళ్లపై వేటు పడేలా చేస్తోంది.
పోటీ తట్టుకోగలడా?
ఈ సమయంలో పంత్‌కి జరిగిన ప్రమాదం చిన్నదేమీ కాదు.
పంత్‌కు బీసీసీఐ మద్దతుగా నిలుస్తోంది. చికిత్సకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని ఇదివరకే ప్రకటించింది. పంత్ త్వరగా కోలుకోవాలని అభిలషించింది.
బీసీసీఐ మద్దతు
పంత్ పోరాట యోధుడు. ఈ గాయాల నుంచి కోలుకుని అంతర్జాతీయ జట్టులోకి తిరిగి వేగంగా వస్తాడని ఆశిద్దాం.