గత 20 ఏళ్లలో టాలీవుడ్‌లో విడుదలైన రోమాంటిక్ చిత్రాలు

YouSay Short News App

ప్రేక్షకులకు కలకాలం గుర్తిండిపోయే తెలుగు సినిమాలు ఎన్నో వచ్చాయి. వీటిని మరో పదేళ్ల తర్వాత చూసినా తొలిసారి చూసిన అనుభూతే కలుగుతుంటుంది. ముఖ్యంగా రొమాంటిక్ సినిమాలు.

రొమాంటిక్ జానర్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని మాత్రమే చెరగని ముద్ర వేశాయి. ఇలా గత రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన రొమాంటిక్ సినిమాలేంటో  ఓ లుక్కేద్దామా.

తొలిప్రేమ(1998)

నేటి తరం వారికి ఈ సినిమా గుర్తిండిపోతుంది. అమెరికా నుంచి వచ్చిన పక్కింటి అమ్మాయిని ప్రేమించే బాలు అనే కుర్రాడి కథే ఇది.

‘అను’తో స్నేహం కుదిరినప్పటికీ తనలోని ప్రేమను ‘బాలు’ వ్యక్త పరచడంలో తడబడుతుంటాడు. ఈ బ్యూటీఫుల్ లవ్‌స్టోరీని ఎన్నిసార్లు చూసినా తనివితీరదు.

నటీనటులు    : పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి దర్శకుడు      : కరుణాకరణ్ సంగీతం       : దేవా

మనసంతా నువ్వే(2001)

అను- చంటీల ప్రేమకథ ఇది. ఓ పేద అబ్బాయి, ధనిక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించిన తీరు బాగుంటుంది.

కొన్ని పరిస్థితుల వల్ల వీరిద్దరూ విడిపోతారు. చివరికి అనూహ్య పరిస్థితుల్లో వీరు ఒక్కటవడంతో శుభం కార్డు పడుతుంది.

నటీనటులు  : ఉదయ్ కిరణ్, రీమా సేన్ దర్శకుడు    : వి.ఎన్ ఆదిత్య సంగీతం     : ఆర్పీ పట్నాయక్

మన్మధుడు(2002)

ఆడవాళ్లు అంటేనే ఇష్టపడని తత్వం అభిరామ్‌ది. అయినప్పటికీ, హారిక అనే అమ్మాయితో ప్రేమలో ఎలా పడ్డాడనేది సినిమా కాన్సెప్ట్‌.

అభిరామ్‌కి ఆడవాళ్లు అంటే ఎందుకు ఇష్టం ఉండదో, అతడి గతం ఏంటో హారిక తెలుసుకుంటుంది. అలా వారి బంధం బలపడుతుంది.

నటీనటులు   : నాగార్జున, సోనాలి బింద్రే,                      అన్షు అంబానీ దర్శకుడు     : విజయ్ భాస్కర్ సంగీతం      : దేవీ శ్రీ ప్రసాద్

జయం(2002)

వెంకట్ అనే కుర్రాడితో సుజాత ప్రేమలో పడుతుంది. అయితే, వీరి ప్రేమకు రఘు అడ్డు తగులుతాడు. సుజాత మీద మోహంతో తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబడతాడు.

వెంకట్, సుజాత తమ ప్రేమను గెలిపించుకున్న  తీరు బాగుంటుంది. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

నటీనటులు   : నితిన్, గోపీచంద్, సదా దర్శకుడు     : తేజ సంగీతం      : ఆర్పీ పట్నాయక్

ఆర్య(2004)

ఆర్య అనే చలాకీ కుర్రాడు గీతను తొలిచూపులోనే ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ, కొన్ని కారణాల వల్ల గీత అజయ్‌కి ప్రపోజ్ చేయాల్సి వస్తుంది.

అజయ్‌పై తనకున్నది ప్రేమ కాదని చివరికి గీత తెలుసుకుంటుంది. ఈ క్రమంలో ఆర్యపై తెలియకుండానే ఇష్టం పెరిగిపోతుంది. చివరికి వీరిద్దరూ ఒక్కటవుతారు.

నటీనటులు   : అల్లు అర్జున్, అను మెహతా,                    శివ బాలాజీ దర్శకుడు     : సుకుమార్ సంగీతం      : దేవీ శ్రీ ప్రసాద్

నువ్వొస్తానంటే నేనొద్దంటానా(2005)

ప్రేమకు అసలైన అర్థం చెప్పిన సినిమా ఇది. ఎన్ఆర్ఐ అయిన సంతోష్, సిరిల మధ్య జరిగిన ప్రేమకథ ఇది.

తమ మధ్య ఉన్నది ఆకర్షణ కాదు ప్రేమే అని నిరూపించడానికి సంతోష్ నానా అగచాట్లు పడతాడు. చివరికి తన ప్రేమను గెలిపించుకుంటాడు.

నటీనటులు     : సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి దర్శకుడు       : ప్రభు దేవా సంగీతం        : దేవీ శ్రీ ప్రసాద్

గోదావరి(2006)

ప్రేమలో విఫలమైన శ్రీరాం.. తనలోని విషాద గాథని చెరిపేసుకోవడానికి గోదావరి నదిపై పడవ ప్రయాణం చేస్తాడు.

ఈ ప్రయాణంలో సీత అనేే అమ్మాయి పరిచయంతో తన జీవితంలోకి నూతన వెలుగు రేఖ ప్రవహిస్తుంది. పడవ ప్రయాణం వీరిద్దరి ప్రేమాయణంగా మారుతుంది.

నటీనటులు     : సుమంత్, కమలిని ముఖర్జీ దర్శకుడు       : శేఖర్ కమ్ముల సంగీతం        : రాధాకృష్ణన్

ఏ మాయ చేసావే(2010)

విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన యువతీ యువకుల ప్రేమకథే ఇది. మతం, ప్రాంతం, భాష అన్నీ భిన్నమే. తమలోని తేడాలను తెలుసుకోవడానికి ప్రేమలో పడతారు.

నటీనటులు     : నాగచైతన్య, సమంత దర్శకుడు       : గౌతమ్ వాసుదేవ్ మీనన్ సంగీతం        : ఏఆర్ రెహమాన్

అలా మొదలైంది(2011)

నిత్య రూపంలో తన కలల రాణిని కనిపెడతాడు గౌతమ్. ఆమే సర్వస్వం అని భావించి ప్రేమిస్తాడు. కానీ, నిత్యకు నిశ్చితార్థం పూర్తయిందని తెలిశాక గౌతమ్ జీవితం మరోసారి అంధకారం అవుతుంది.

నటీనటులు   : నాని, నిత్యామేనన్ దర్శకుడు     : నందిని రెడ్డి సంగీతం      : కళ్యాణి మాలిక్

ఊహలు గుసగుసలాడే(2014)

న్యూస్ రీడర్‌గా పనిచేయాలనే వెంకీకి బాస్ ఉదయ్ ఓ కండీషన్ పెడతాడు. బాస్‌కి ప్రేమ విషయంలో సాయం చేయబోయి తను ప్రేమలో పడతాడు.

నటీనటులు     : నాగశౌర్య, రాశి ఖన్నా దర్శకుడు       : శ్రీనివాస్ అవసరాల సంగీతం        : కళ్యాణి మాలిక్

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు(2015)

కొన్ని కారణాల వల్ల ఓ యువ ప్రేమ జంట విడిపోవాల్సి వస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఒకరికొకరు తారసడతారు.

నటీనటులు    : శర్వానంద్, నిత్యామీనన్ దర్శకుడు      : క్రాంతి మాధవ్ సంగీతం       : గోపీ సుందర్

మజిలీ(2019)

ప్రేమలో విఫలమై మందుకి బానిసైన పూర్ణకి శ్రావణి అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది.పూర్ణని ఎంతోకాలంగా శ్రావణి ప్రేమిస్తుంటుంది. చివరికి పూర్ణ తేరుకుని శ్రావణిని అర్థం చేసుకుంటాడు.

నటీనటులు    : నాగచైతన్య, సమంత,                     దివ్యాంశ కౌశిక్ దర్శకుడు      : శివ నిర్వాణ సంగీతం       : తమన్, గోపీ సుందర్

సీతారామం(2022)

చాలా ఏళ్ల తర్వాత వచ్చిన స్వచ్ఛమైన ప్రేమకథ. అనాథ అయిన ఆర్మీ అధికారి రామ్‌ని సీత పేరుతో ప్రిన్సెస్ నూర్జహాన్ ప్రేమిస్తుంది. తన భార్య అంటూ లేఖలు రాస్తుంది. సీతను కలుసుకున్న రామ్ మధ్య ప్రేమ చిగురిస్తుంది.

ఇంతలో  ఓ ఆర్మీ ఆపరేషన్ కోసం రామ్‌ వెళ్లడటం వల్ల వీరిద్దరు ఎడబాటుకు గురవుతారు. తనను ప్రేమించింది సాధారణ అమ్మాయి కాదు ప్రిన్సెస్ నూర్జహాన్ అని తెలుసుకుంటాడు రామ్. రామ్ మరణంతో విషాధాంతంగా కథ ముగుస్తుంది

నటీనటులు   : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్,                   రష్మిక మందన్న దర్శకుడు     : హను రాఘవపూడి సంగీతం      : విశాల్ చంద్రశేఖర్

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి