HCA అవార్డుల్లో RRR సంచలనం ఇంకా మంచి సినిమాలతో వస్తామన్న రాజమౌళి

YouSay Short News App

ప్రపంచ యవనికపై భారత సినిమా ఘనత చాటుతున్న RRR మరో మరో మైలురాయిని అధిగమించింది. ప్రతిష్టాత్మక హాలివుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌(HCA) అవార్డుల్లో సత్తా చాటింది.

HCA అవార్డుల్లో నాలుగు విభాగాల్లో RRR ఘనతను చాటింది. బెస్ట్‌ స్టంట్స్‌, బెస్ట్‌ సాంగ్‌, బెస్ట్ యాక్షన్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా రాజమౌళి కళాఖండం రికార్డు సృష్టించింది.

ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌తో రికార్డు సృష్టించిన ‘నాటు నాటు’ HCA అవార్డుల్లోనూ మెరిసింది. బెస్ట్‌ సాంగ్‌గా నాటు నాటు నిలిచింది.

బెస్ట్‌ సాంగ్‌ - నాటు నాటు

నాటు నాటుకు గాను అవార్డు అందుకున్న కీరవాణి.. స్టీఫెన్‌ సండ్‌హెయిమ్‌ ట్యూన్‌తో పాట పాడి ధన్యవాదాలు చెప్పారు.

లాస్‌ ఎంజెల్స్‌కు వచ్చి ఇలా అవార్డు అందుకోవడం గర్వకారణం కదా. థ్యాంక్యూ రాజమౌళి అంటూ కీరవాణి పాట పాడాడు.

RRRలో అందరి దృష్టినీ ఆకర్షించిన మరో అంశం స్టంట్స్‌. అడవిలో రామ్‌, భీమ్‌ కలిసి చేసే ఫైట్లు, పులితో చేసే స్టంట్లు, రామ్‌ పాత్ర పరిచయంలో ఉండే ఫైట్‌ ఇలా ప్రతిదీ ప్రత్యేకమే.

బెస్ట్‌ స్టంట్స్‌

నా స్టంట్‌ కొరియోగ్రాఫర్స్ సాల్మన్‌, జుజిలకు శుభాకాంక్షలు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ రెండు, మూడు షాట్లు మినహా మొత్తం స్టంట్లు స్వయంగా చేశారు. 320 రోజులు కష్టపడి సినిమా చేస్తే అందులో ఎక్కువ భాగం స్టంట్స్‌కే కేటాయించాం. ఈ అవార్డు రావడం సంతోషం. మేరా భారత్‌ మహాన్‌ జైహింద్‌- రాజమౌళి

RRR ఎమోషనల్‌ సినిమా అయినా అందులో బెస్ట్‌ యాక్షన్‌ సీన్లు ఉన్నాయి. అందుకే బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా RRR, HCA అవార్డ్‌ను సొంతం చేసుకుంది.

బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌

యాక్షన్‌ ఫిల్మ్‌గా RRR ఘనత సాధించిందంటే అది స్టంట్‌ కొరియోగ్రాఫర్ల గొప్పదనమే. వారికంటూ ప్రత్యేక విభాగంలో అవార్డులు ఇవ్వాలని HCAను కోరుతున్నా. ఈ అవార్డును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టంట్‌ కొరియోగ్రాఫర్లకు అంకితమిస్తున్నా                                - రాజమౌళి

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఇండియన్‌ సిినిమా సత్తా చాటి ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా ఎదిగిన RRRకు HCA బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌గా అవార్డుతో సత్కరించింది.

బెస్ట్‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్

ఇంత ప్రేమను మాకు పంచుతున్నందుకు ధన్యవాదాలు. మాపై బాధ్యతను పెంచారు. తప్పకుండా ఇంకా మంచి సినిమాలతో వస్తాం- రామ్‌ చరణ్‌

ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కు ఇంటర్నేషనల్‌ సినిమాలు చేయగలమనే నమ్మకాన్ని ఈ అవార్డు ఇచ్చింది. థ్యాంక్యూ. జైహింద్‌.

ఆస్కార్‌ అవార్డులకూ ‘నాటు నాటు’ నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. అక్కడ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ RRR టీంకు YouSay తరఫున శుభాకాంక్షలు

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.