సల్మాన్ ఖాన్‌కి ఇంతమంది మాజీ ప్రేయసిలున్నారా!

YouSay Short News App

బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ 57వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు సల్లు భాయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్.. సల్లు పుట్టినరోజు సందర్భంగా పెద్ద వేడుకను నిర్వహించింది.

ఈ వేడుకకు విచిత్రంగా సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసిలు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు 13మందితో సల్మాన్‌ ఖాన్ ప్రేమలో పడటం విశేషం. మరి ఆ అందమైన భామలెవరో ఓ లుక్కేద్దామా..!

సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌లను దగ్గర చేసింది  ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమానే. 1999లో  ఈ మూవీ చిత్రీకరణలోనే వీరు ఒకరికొకరు మనసిచ్చుకున్నారట. అయితే వివేక్ ఓబెరాయ్ వల్ల 2002లో ఈ జంట విడిపోవాల్సి వచ్చిందని టాక్.

ఐశ్వర్య రాయ్

కత్రినా కైఫ్‌పై సల్మాన్ మనసు పారేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. బాలీవుడ్‌లో ఎల్లకాలం నిలిచిపోయే ప్రేమకథ వీరిది. దురదృష్టవశాత్తు  2010లో వీరిద్దరూ దూరమయ్యారు.

కత్రినా కైఫ్

చిన్నతనంలోనే షాహీన్ జాఫ్రీతో ప్రేమాయణం నడిపాడు సల్లు భాయ్. షాహీన్ మోడల్‌గా ఉన్నప్పుడు ఆమె ప్రేమలో సల్మాన్ మునిగి తేలాడు. కానీ ఈ జంట బంధం ముడిపడలేదు. షాహీన్‌ కూతురే.. నటి సయ్యేషా సైగల్. హీరోయిన్ కియారా అడ్వాణీ షాహీన్‌కి మేనకోడలు.

షాహీన్ జాఫ్రీ

సల్మాన్ ఖాన్ తొలిప్రేమ సంగీత బిజ్లానీతోనే. 1994 ప్రపంచ సుందరి అయిన సంగీతతో దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రేమాయణం నడిపాడు. కానీ, ఏమైందో తెలీదు వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సంగీత క్రికెటర్ అజారుద్దీన్‌ని వివాహం చేసుకుంది.

సంగీత బిజ్లానీ

సల్మాన్‌ ఖాన్‌తో బ్రిటిష్- బంగ్లాదేశీ భామ ఫరియా అలమ్ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. కానీ, ఈ పుకార్లను సల్లు భాయ్ తోసిపుచ్చాడు.

ఫరియా ఆలమ్

సంగీత బిజ్లానీతో రిలేషన్ కట్ అయ్యాక పాకిస్థాన్ నటి సోమీ అలీతో సల్మాన్ సహజీవనం చేశాడు. దాదాపు ఆరేళ్లు కలిసి ఉన్న తరువాత వీరు విడిపోయారు.

సోమీ అలీ

అయితే, ఇటీవల తన ఇన్‌స్టా ద్వారా సల్మాన్ ఖాన్‌ని ఓ కామాంధుడిగా సోమీ అభివర్ణించింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అచ్చం ఐశ్వర్యారాయ్‌లా కనిపించే నటి స్నేహా ఉల్లాల్. విచిత్రంగా ఐశ్వర్యతో విడిపోయాక సల్మాన్‌కు స్నేహాతో పరిచయం ఏర్పడింది. అయితే, దీర్ఘకాలం పాటు వీరి బంధం కొనసాగలేదు.  ఆ తర్వాత సినిమాల్లోనూ స్నేహా కనిపించలేదు.

స్నేహా ఉల్లాల్

వీర్, రెడీ, పార్ట్‌నర్2 వంటి సినిమాల్లో సల్మాన్‌ సరసన నటించింది జరీన్ ఖాన్. కత్రినా కైఫ్‌తో తెగతెంపులు చేసుకున్నాక సల్మాన్.. ఈ నటి మాయలో పడ్డాడు. అయితే, కత్రినాను దెప్పి పొడవడానికే జరీన్‌కు సల్మాన్ దగ్గరయ్యాడని చాలా మంది భావిస్తుంటారు.

జరీన్ ఖాన్

తన ప్రేయసిగా లులియా వతూర్‌ని బాలీవుడ్‌‌కి పరిచయం చేశాడు సల్మాన్ ఖాన్. ఈ రొమేనియా దేశస్థురాలితో ఏర్పడిన బంధం.. పెళ్లి ప్రకటన వరకూ వెళ్లింది. కానీ, వీరి ప్రణాళికలు పటా పంచలయ్యాయి.

లులియా వంతూర్

‘జై హో’ సినిమాతో డైసీ షాను సల్మాన్ పరిచయం చేశాడు. సల్మాన్‌తో డైసీ సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలు వినిపించాయి.

డైసీ షా

సల్మాన్ ‘రేస్3’ సినిమాలోనూ ఈ హీరోయిన్ నటించబోతున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.

ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ప్రస్తుతం బహు భాషా చిత్రాలతో బిజీగా గడుపుతోంది పూజా హెగ్దే. సల్లు భాయ్‌తో కలిసి ఈ అమ్మడు ‘కిసి కా భాయ్ కిసి కీ జాన్’ అనే సినిమా చేయబోతోంది. అయితే, వీరి మధ్య కూడా ఏదో నడుస్తోందని టాక్.

పూజా హెగ్దే