YouSay Short News App

Samantha: సిటాడెల్‌ షూటింగ్‌లో  తీవ్రంగా గాయపడిన సమంత

టాలీవుడ్ అగ్రనటి సమంత సిటాడెల్ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌లో గాయపడింది

బాలీవుడ్‌లో సమంత ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగులో తన రెండు చేతులకు గాయాలనైట్లు సమంత వెల్లడించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్.. తన చేతులకు గాయాలైన ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.

ఇన్‌స్టాగ్రాం స్టోరీలో షేర్ చేస్తూ ‘యాక్షన్ చేయడం వల్ల లభించే ప్రోత్సాహకాలు’(పెర్క్స్ ఆఫ్ యాక్షన్) అంటూ స్టోరీలో కామెంట్ చేసింది.

సమంత చేతులు బాగా కందిపోయినట్లు కనిపించాయి. అయినా, తాను బాధపడటం లేదనే విషయాన్ని ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది.  ఒకింత గర్వంగా భావిస్తున్నట్లు తెలిపింది.

మొన్నటి వరకు సమంత షూటింగులకు దూరంగా ఉన్న సామ్  మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంది.

మయోసైటిస్ వ్యాధి కారణంగా షూటింగులకు గ్యాప్ వచ్చింది. పునరాగమనం తర్వాత సామ్ చేస్తున్న తొలి ప్రాజెక్టు ‘సిటాడెల్’

‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాలోనూ సామ్ తన పార్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంది.

సమంత లీడ్ రోల్ చేసిన శాకుంతలం సినిమా  ఏప్రిల్ 14న విడుదల కానుంది

ఇప్పటికే మయోసైటిస్‌తో పోరాడిన సమంత త్వరగా గాయాల నుంచి  కోలుకొని షూటింగులో పాల్గొనాలని ఫ్యాన్స్  ప్రార్థిస్తున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్  వెబ్‌స్టోరీల  కోసం లింక్‌ని క్లిక్ చేయండి.