సమంత ‘యశోద’ మూవీ రివ్యూ

YouSay Short News App

హరి హరీశ్‌ దర్శకత్వంలో సమంత లీడ్‌ రోల్‌లో సర్రోగసీ నేపథ్యంలో  సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘యశోద’ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది.

యశోద

సినిమా స్టార్టింగ్‌లోనే  ఓ రేప్‌ సీన్‌తో  సీరియస్‌ నోట్‌లో మొదలవుతుంది. ఆ తర్వాత సరోగసీ, సమంత పాత్ర పరిచయం జరుగుతాయి.

సీరియస్‌ స్టార్ట్‌

డబ్బుల కోసం సమంత సరోగసీకి ఒప్పుకోవడం, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నడిచే ఈవా అనే సరోగసీ సెంటర్‌కు వెళ్లడం, దీనికి సమాంతరంగా మర్డర్‌ ఇన్విస్టిగేషన్‌ కొనసాగుతాయి.

పాత్రల పరిచయం

ప్రీ ఇంటర్వెల్‌ సమయానికి సరోగసీ సెంటర్‌పై సమంతకు అనుమానం రావడం, ఆ తర్వాత సమంత ఇన్వెస్టిగేషన్‌తో దర్శకుడు మెల్లగా కథలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ అసలు సినిమా మొదలవుతుంది.

ప్రీ ఇంటర్వెల్‌

ఇంటర్వెల్‌ సమయానికి బిగ్‌ ట్విస్ట్‌ ఉంటుంది. సమంత సరోగసీ సెంటర్‌ రహస్యాలను తెలుసుకుని అక్కడి నుంచి పారిపోవాలనుకుంటుంది. మెల్లగా మొదలైనా ఇంటర్వెల్‌ కల్లా ప్రేక్షకుడికి సినిమాలో ఆసక్తి పెరుగుతుంది.

ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌

ఇంటర్వెల్‌ తర్వాత సమంత బందీ కావడం, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఫ్లాష్‌బ్యాక్, ట్విస్టులతో ఇంటరెస్టింగ్‌గా సాగుతుంది.

ఫ్లాష్‌బ్యాక్‌

ఫ్లాష్‌బ్యాక్‌ కూడా దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించాడు. సమంతతో పాటు ఇతర నటులు చాలా అద్భుతంగా నటించారు.

ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుటుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే మరో ట్విస్ట్‌ కూడా చాలా బాగుంది. కానీ వీటిని ఇంకాస్త బెటర్‌గా చూపించాల్సింది.

ప్రీ క్లైమ్యాక్స్‌, క్లైమ్యాక్స్‌

చివరిగా సినిమా పాజిటివ్‌ ఫీల్‌తో ముగుస్తుంది. ప్రీమియర్స్‌ చూసిన చాలా మంది కూడా ఇదే ఫీలవుతూ ట్విట్టర్‌లో సినిమాపై పాజిటివ్‌గా పోస్ట్‌ చేస్తున్నారు.

పాజిటివ్‌ రెస్పాన్స్‌

కథ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విజువల్స్‌ సమంత నటన

తొలి 20 నిమిషాలు అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం

బలహీనతలు:

రేటింగ్‌ 2.75/5

బలాలు:

ఫైనల్‌గా ఫస్టాఫ్‌లో కొంత భాగాన్ని భరించగలిగితే, మిగతా సినిమా అంతా ఇంటరెస్టింగ్‌గా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్ వరకూ చాలా బాగుటుంది. థ్రిల్లర్స్‌ ఇష్టపడేవారు, సమంత ఫ్యాన్స్‌ తప్పక చూడొచ్చు.

ఒక్క మాటలో