జమ్ముకశ్మీర్‌లోని పండిట్ ఫ్యామిలీలో పుట్టిన సందీప.. 8 ఏళ్లకే భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. ముంబయిలో విద్యాభ్యాసం చేసింది.
2010లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఇసీ లైఫ్ మీన్’ (Isi Life Mein)తో సందీప తెరంగేట్రం చేసింది. ఇందులో రజ్‌నందిని పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
2012లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ చిత్రం 'దబాంగ్ 2' (Dabangg 2)లో క్యామియో ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత వరుసగా 'హీరోపంతి', ‘గొల్లు ఔర్ పప్పు’, ‘గ్లోబల్ బాబా’, ‘7 హవర్స్ టూ గో’ వంటి హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది.
సందీప ధార్ గత చిత్రాలు.. ‘కార్టెల్’ (Cartel), ‘కాఘజ్’ (Kaagaz) సైతం బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న ఆదరణను మరింత పెంచాయి.
ఓ వైపు వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేస్తూనే.. వెబ్‌సిరీస్‌లోనూ ఈ అమ్మడు కీలక పాత్రలు పోషించింది. తద్వారా ఓటీటీలోనూ తనకంటూ ప్రత్యేక ఫేమ్‌ను సంపాదించుకుంది.
హిందీలో సందీప చేసిన ‘అభయ్’ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన 'ఫ్లిప్', 'ముమ్ భాయ్', 'బిసాత్: ఖేల్ షత్‌రంజ్ కా', 'మై', 'డా. అరోరా' వంటి సిరీస్‌లోనూ సందీప మెరిసింది.
ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సందీప.. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది.
తన ఇస్‌స్టాగ్రామ్‌లో వరుసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
సందీప ఎప్పటికప్పుడు నిర్వహించే ఫొటో షూట్‌లకు నెటిజన్లలో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ హాట్ ట్రీట్‌ను తీసుకునేందుకు 2.7 మిలియన్ల మంది ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అనుసరిస్తున్నారు.
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.