భావోద్వేగంగా ఆటకు వీడ్కోలు...సానియా విజయ ప్రస్థానం...
Sania mirza retirement:
భారత వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ ఓపెన్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది.
‘లైఫ్ అప్‌డేట్’ అనే క్యాప్షన్‌తో మూడు పేజీల లేఖలో తన టెన్నిస్ ప్రయాణాన్ని భావోద్వేగపూరితంగా వివరించింది.
‘నా గ్రాండ్‌స్లామ్ ప్రయాణం 2005లో ఆ్రస్టేలియన్ ఓపెన్‌తోనే మొదలైంది. ఇప్పుడు గ్రాండ్‌స్లామ్ ఆట కూడా అక్కడే ముగించేందుకు సరైన వేదిక అనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది.
ఇక కెరీర్‌లో చివరి టోర్నీ మాత్రం దుబాయ్ ఓపెన్ అని పేర్కొంది. ఇన్నేళ్ల పయనంలో ఎన్నో ఆటుపోట్లే కాదు మరెన్నో మధురస్మృతులూ ఉన్నాయి’ అని లేఖలో పేర్కొంది.
సానియా మీర్జా ఆరవ ఏటనే టెన్నీస్ ఆరంభించినా ప్రొఫెషనల్ కెరీర్‌ను 17వ ఏట 2003లో ప్రారంభించింది.
టెన్నిస్ కెరీర్
జూనియర్ స్థాయిలో 10 సింగిల్స్ టైటిల్స్, 13 డబుల్స్ టైటిల్స్ సాధించింది.2004- హైదరాబాద్‌లో జరిగిన హైదరాబాద్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ సాధించింది.
2009- ఆస్ట్రేలియ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్ టైటిల్ విన్నర్- మహేష్ భూపతితో జోడి
ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు
2012- ఫ్రెంచ్ ఓపెన్- మిక్స్‌డ్ డబుల్ టైటిల్ విజయం- మహేష్ భూపతితో జోడి
2014- యూఎస్ ఓపెన్- మిక్స్‌డ్ డబుల్ టైటిల్ విజయం- బ్రూనో సోరస్‌తో జోడీ
2015- సానియా మీర్జా స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో కలిసి వరుసగా మూడు డబుల్స్ టైటిల్స్ గెలిచి హ్యాట్రిక్ సాధించింది.
2015- వింబుల్డన్ డబుల్స్ టైటిల్, యూఎస్
ఓపెన్ టైటిల్
2016- ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్
మహిళల డబుల్స్ కేటగిరీలో రెండేళ్లుపాటు నెం. 1 క్రీడాకారిణిగా సానియా కొనసాగారు
అవార్డులు - రికార్డులు
అర్జున అవార్డు-2004, రాజీవ్ ఖేల్‌రత్న-2015, పద్మభూషణ్-2016
2015- బీబీసీ ప్రకటించిన ప్రపంచంలో 100 మంది స్ఫూర్తిదాయక మహిళల్లో ఒకరుగా రికార్డు