312257684_189032596950810_4835466490041805944_n.webp (1)

సంక్రాంతి పందెంకోళ్లు.. బరిలో నిలిచిన సినిమాలు..!

LOGO 1

YouSay Short News App

తెలుగు సినిమాలకు సంక్రాంత్రి పండుగ అతిపెద్ద సీజన్. వసూళ్ల పరంగా సినిమాలకు నిజంగా ఇది పండుగే. అందుకే సంక్రాంతిని సినిమాల పండగగా భావిస్తారు.

312150109_439928008211184_598130471078879685_n.webp

సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని  సినిమాలు షెడ్యూల్‌ను అనుసరిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే పండుగకు విడుదలవుతుంటాయి. మరికొన్ని తప్పుకుంటాయి.

284276313_417937393266146_4228987872686773471_n.webp

చిరంజీవి ‘భోళా శంకర్’, రామ్‌చరణ్ ‘ఆర్‌సీ15’, ప్రభాస్ ‘ఆదిపురుష్’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమళ్లు’ సినిమాలన్నీ తొలుత సంక్రాంతి డేట్లనే ఫిక్స్ చేశాయి. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నాయి.

తొలుత ఈ సినిమాలు..

159980336_108887241178604_5041625418994248285_n (1)

రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్‌ల సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. మరోవైపు ప్రభాస్ ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. టీజర్‌కి వచ్చిన స్పందన ఆధారంగా గ్రాఫిక్స్‌పై  చిత్రబృందం తుది మెరుగులు దిద్దుతోంది. అందుకే ఈ సినిమా ఆలస్యమవుతోంది.

వెనక్కి తగ్గిన చిత్రాలు

FharmUXakAA_SYr

చిరంజీవితో సంక్రాంతి పోరులో బాలయ్య నిలుస్తున్నారు. వీరిద్దరూ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు బాక్సాఫీస్ ఎదుట పోటీపడనున్నాయి.

చిరుతో బాలయ్య ఢీ..

308756930_676459420562971_570121241430002336_n.webp

చిరు ‘భోళాశంకర్’ సంక్రాంతి పోరు నుంచి తప్పుకున్నా, మెగాస్టార్ మాత్రం రేసులోనే ఉన్నారు. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతికే వస్తోంది. జనవరి 11న ఇది విడుదలయ్యే అవకాశం ఉంది.

వాల్తేరు వీరయ్య..

312150109_439928008211184_598130471078879685_n.webp

బాలకృష్ణకు సంక్రాంతి హీరో అనే పేరుంది. తాజాగా బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న విడుదల కానుంది. 'అఖండ' విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో బాలయ్య ఉత్సాహంగా ఉన్నారు.

వీరసింహారెడ్డి

293373098_368227585257419_1972265010516357364_n

ఈ సంక్రాంతి రేసులో అనూహ్యంగా పోటీలోకి వచ్చిన సినిమా అఖిల్ ‘ఏజెంట్’. తామూ సంక్రాంతి రేసులో ఉన్నామని ప్రొడ్యూసర్లు ప్రకటించడం గమనార్హం. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది.

అనూహ్యంగా పోటీలోకి..

312845829_899022098174876_4390628011654683262_n.webp

తమిళ హీరో విజయ్- వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ‘వారసుడు’ డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. అజిత్ ‘తునివు’ కూడా పోటీలో ఉంది. ఇవే కాక మరో రెండు, మూడు అనువాద సినిమాలూ పోటీపడనున్నాయి.

తమిళ సినిమాలు..

308067024_151354847224558_5512619062282856015_n.webp

ఇప్పటివరకైతే మూడు తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి రేసులో నిలిచాయి. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది.

మూడు తెలుగు.. రెండు తమిళ్

FhbhP13VQAA1rqp

మరి ఈ సంక్రాంతికి ఏ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి. సంక్రాంతి పందెం కోడిగా గెలిచేదెవరో వేచి చూడాలి.

సంక్రాంతి పందెంకోడి ఎవరో..