ws_Snapinsta.app_1080_290060903_2100725210101157_229970244046060271_n
Red Section Separator

YouSay Short News App

ఈ చీరలతో సంక్రాంతిని మరింత ఆస్వాదించండి

ws_300380961_602782221250054_4837895291721787932_n

జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్.. అనసూయ. ఆ తర్వాత రంగమ్మత్తగా మరింత ఫేమస్ అయింది. అయితే, అనసూయ ధరించిన కొన్ని చీరలు ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించాయి.

ws_299881134_2727664617367833_3180099334940913616_n

సంప్రదాయ చీరకట్టుతో, మెరిసిపోయే అందంతో అనసూయ ప్రేక్షకుల మదిని దోచేసింది. సంక్రాంతికి ఎలాంటి చీరను తీసుకుందామని ఆలోచిస్తున్నారా? అయితే వీటిని ఓసారి ట్రై చేసి చూడండి. పండుగను మరింత ఆస్వాదించండి.

ws_Snapinsta.app_1080_320260939_195205926362631_2820443618874496801_n

రెడ్- గోల్డెన్ అంచుతో..

ఎంతమందిలో ఉన్నా ఎరుపు రంగు ఇట్టే ఆకర్షిస్తుంది. రెడ్, గోల్డెన్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న అంచు.. చీరకు ప్రత్యేక అందాన్ని తీసుకొస్తుంది. ఈ చీరతో పాటు ఆభరణాలు, మ్యాచింగు గాజులు వేసుకుంటే ఇతరులు ఫ్లాట్ కావాల్సిందే.

అధిక డిజైన్

రెడ్ బ్లౌజు, గోల్డెన్ అంచున్న ఈ చీర యువ ఆడపడుచులకు బాగా నప్పుతుంది. మెడలో ఏదైనా ఆభరణాలు, సరితూగే గాజులు, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీ అందం రెట్టింపవుతుంది.

సింపుల్ ఔట్‌ఫిట్

చక్కగా, పొందికగా కనిపించాలని అనుకుంటే  ఈ ఔట్‌ఫిట్‌ని ట్రై చేసి చూడొచ్చు. లెహెంగా లేదా చీరకు సరిపడే ఆభరణాలు ధరిస్తే మరింత బాగుంటుంది.

తేలికైన చీర..

చీర తేలికగా ఉంటే ఎంతసేపైనా కట్టుకుని ఉండాలనిపిస్తుంది. అలాంటిదే ఇది. వివిధ రంగుల్లో ఉండే ఈ చీరను కట్టుకుంటే మీరే  ప్రత్యేక ఆకర్షణగా మారుతారు.

వయోలెట్- డార్క్ గ్రీన్

అందరినీ ఎక్కువగా ఆకట్టుకునే మ్యాచింగ్ ఇది. వయోలెట్ బ్లౌజు, బంగారపు అంచున్న డార్క్ గ్రీన్ చీర మీకు ప్రత్యేక అందాన్ని తెస్తుంది. హాఫ్ సారీ, సారీలోనూ ఈ మ్యాచింగును ప్రయత్నించి చూడొచ్చు. పొడుగు జడ కలవారికి ఇది చూడ ముచ్చటగా ఉంటుంది.

రెడ్- డార్క్ గ్రీన్

డార్క్ రెడ్, గ్రీన్ కాంబినేషన్ చాలా పాపులర్.  ఈ చీరను ధరించినప్పుడు వడ్డాణం, జుంకా, పాపడి బిల్లలు పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.

ప్రకాశవంతంగా..

ప్రకాశవంతమైన రంగులు ఇట్టే దృష్టిని ఆకర్షిస్తాయి. సంప్రదాయ వస్త్రధారణలో ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. లంగాఓణి లేదా చీరను ఇలా ట్రై చేయొచ్చు.

చిలకపచ్చని బ్లౌజుతో..

చిలకపచ్చని బ్లౌజుతో తెల్లటి పలుచని చీర కాంబినేషన్ మరింత ఆకట్టుకుంటుంది. ఆభరణాలు అవసరం లేని ఔట్‌ఫిట్ ఇది.  ఈ కాంబోకి తగిన గాజులు, చెవికమ్మలు పెట్టుకుంటే పని పూర్తైనట్లే.

గులాబీ.. పసుపు

గులాబీ సిల్క్ చీరపై ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుని.. లేత పసుపు జాకెట్టుతో కలిపి కుట్టించుకుంటే ఆ చీరకు ఉండే అందమే వేరు. జుట్టుని కాస్త అలంకరించుకుని.. సరైన ఆభరణాలు ధరిస్తే ఈ ఔట్‌ఫిట్‌‌లో ఆకట్టుకునేలా కనిపిస్తారు.

డార్క్ బ్లూ- గ్రీన్

ఫెస్టివల్ వైబ్స్‌ని ఉట్టిపడేలా చేసే కాంబినేషన్ క్లాసిక్ బ్రైట్ కలర్ ఇది. డార్క్ బ్లూ, గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఈ చీర చుడితే యువరాణిలా కనిపించడం ఖాయం.