సంక్రాంతి సినిమాలు..బాక్సాఫీస్‌ కలెక్షన్లు ఎవరు విన్నర్‌?

YouSay Short News App

టాలివుడ్‌ బాక్సాఫీస్‌ పండుగ సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. బాలయ్య, చిరంజీవితో పాటు తమిళ హీరోలు అజిత్, విజయ్ సినిమాలు పరవాలేదనిపిస్తున్నాయి. ఎవరెన్ని కలెక్షన్లు సాధించారో చూద్దాం

మెగాస్టార్ చిరంజీవి వింటేజ్‌ పాత్రలో వచ్చిన  ఈ సినిమా పాజిటివ్‌ బజ్‌తో దూసుకుపోతోంది. మూడ్రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టిస్తోంది. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

వాల్తేరు వీరయ్య

విడుదల: జనవరి 13 బాక్సాఫీస్‌: రూ. 108 కోట్లు హైదరాబాద్‌లో షోలు : 394

బాక్సాఫీస్‌ వీరయ్య

గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన బాలయ్య వీర సింహారెడ్డి కూడా తొలిరోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు రూ.50 కోట్లు వసూలు చేసింది. వాల్తేరు వీరయ్య విడుదలతో కాస్త కలెక్షన్లు తగ్గాయి.

వీర సింహారెడ్డి

విడుదల: జనవరి 12 బాక్సాఫీస్‌: రూ. 88 కోట్లు హైదరాబాద్‌లో షోలు : 254

బాక్సాఫీస్‌ వీర

వంశీ పైడిపల్లి తెరకెక్కించిన విజయ్‌ సినిమా తమిళంలో బాగానే ఆడుతోంది. తెలుగులో కాస్త కలెక్షన్లు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

వారిసు

విడుదల: జనవరి 11 బాక్సాఫీస్‌: రూ. 149 కోట్లు

బాక్సాఫీస్‌ వారసుడు

అజిత్‌ హీరోగా సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా తునివు. తెలుగులో తెగింపుగా వచ్చింది. వారిసుతో పాటు విడుదలైన కలెక్షన్ల పరంగా కాస్త వెనకబడి ఉంది.

తెగింపు

విడుదల: జనవరి 11 బాక్సాఫీస్‌: రూ. 109 కోట్లు

బాక్సాఫీస్ తెగింపు

ఇంకా రెండు మూడు రోజులు బాక్సాఫీస్‌ వార్‌ కొనసాగే అవకాశముంది. జనవరి 16న కూడా సంక్రాంతి సెలవు కావడంతో కలెక్షన్ల సునామీ కొనసాగే అవకాశముంది.