తారల ఇంట సంక్రాంతి సంబురం

YouSay Short News App

చూపు తిప్పుకోలేని అందాల కనువిందు.

పండగ వచ్చిందంటే తారల సందడి అంతా ఇంతా కాదు. షూటింగ్‌కి విరామం ఇచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది సంక్రాంతి పండగను అదిరిపోయేలా జరుపుకున్నారు. మరి మీ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఏం చేశారో ఓ లుక్కేయండి.

పొంగల్ వేడుకలో ముద్దు గుమ్మ కీర్తి సురేశ్ సందడి చేసింది. పొంగళి చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. యేల్లో కలర్ సారీలో తళుకున మెరిసింది కీర్తి. ఈ వేడుకకు హీరోయిన్ ప్రియాంక మోహనన్ కూడా వచ్చింది.

కీర్తి సురేశ్

తమిళ నటి సాక్షి అగర్వాల్ చీరకట్టులో హొయలొలకించింది. చెరకుగడల మధ్య పొంగలి చేసింది ముద్దుగుమ్మ.

సాక్షి అగర్వాల్

నటి అనసూయ భరద్వాజ్ కుటుంబంతో కలిసి సరాదాగా గడిపారు. పిల్లలతో కలిసి పతంగులు ఎగురవేశారు. మెుక్కజొన్న తింటూ ఎంజాయ్ చేసినట్లు పోస్ట్ చేసింది ఈ యాంకర్.

అనసూయ భరద్వాజ్

భోగి మంటలు వేసి ఫ్యాన్స్‌కు శుభాకాంక్షలు చెప్పింది బిగ్ బాస్ ఫేం దివి. భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షించింది.

దివి

నభా నటేష్ పతంగులు ఎగురవేసి వేడుక జరుపుకుంది. సంప్రదాయ వస్త్రాలు ధరించి తళుక్కున మెరిసింది.

నభా నటేష్

ప్రముఖ మోడల్ స్పందన పాలి పాల మీగడలాంటి పట్టు వస్త్రాల్లో అందంగా కనిపించింది. ముగ్గులు వేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

స్పందన పాలి

ఇషా చావ్లా కుటుంబంతో కలిసి భోగి  మంటలు వేసింది.

ఇషా

ప్రతి పండగకి ఇంట్లో వాలిపోయే రౌడీ బాయ్  ఈ సారి కూడా సంక్రాంతిని కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫోటో షేర్ చేశాడు విజయ్.

విజయ్ దేవరకొండ

హీరో నితిన్‌ ఇంటి దగ్గర వేసిన ముగ్గులతో అభిమానులకు విషెస్ చెప్పాడు. బంధువులతో ఉల్లాసంగా గడిపాడు యంగ్ హీరో.

నితిన్‌

హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ తన భార్య వితికతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. పతంగులు ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపింది ఈ జంట.

వరుణ్ సందేశ్

టాలీవుడ్‌లో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ ఇంటి వద్ద భోగి మంటలు వేసి పండగను ఆస్వాదించారు. కుటుంబసభ్యులందరూ చిల్ అయ్యారు.

విశ్వక్ సేన్

ప్రతి ఏడాది మాదిరాగనే మంచు ఫ్యామిలీ భోగి వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఇందులో మోహన్ బాబు, విష్ణు సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారి పిల్లలు సందడి చేశారు.

మంచు విష్ణు