YouSay Short News App

సంక్రాంతి పిండివంటల ఘుమఘుమలు

సంక్రాంతి పండగకు పిండివంటల గుమగుమలు, నోరూరించే రుచుల మజానే వేరు. ఏ ఇళ్లు చూసినా వంటకాల వాసన ఉండాల్సిందే.

చకినాలు, అరిసెలు, జంతికలు, సున్నండలు, గారెలు ఇలా ఒక్కటేమిటీ ఎన్నో రకాల స్పెషల్స్‌ సంక్రాంతికి ఊరిస్తాయి. అవెంటో, ఎలా చేస్తారో ? ఆరోగ్యానికి ఎందుకు మంచిదో ఓ లుక్కేయండి.

భోగి స్పెషల్‌ వంటకం ఈ స్వీట్‌ పొంగలి. పెసరపప్పు, బియ్యం, పాలు, నీళ్లు, నెయ్యి వేసుకొని ఉడికబెట్టి చేస్తారు. బెల్లం పాకం పట్టి, డ్రైఫ్రూట్స్ వేయించి అందులో వేసేస్తే ఓ పట్టు పడతారంతే.

పొంగలి

సంక్రాంతి పండగంటే గుర్తొచ్చేవి అరిసెలు. బియ్యపు పిండి, బెల్లం, నూనె, నువ్వులు వాడతారు. వీటిలో కార్బొహైడ్రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అరిసెలు

బియ్యాన్ని నానబెట్టి దంచి వీటిని తయారు చేస్తారు. నెలకుపైగా నిల్వ ఉంటాయి. కొన్నిచోట్ల ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకుంటారట. ఇందులో నువ్వులు, వాము వాడటంతో వీటిలో ఉండే పోషకాలు జలుబు, దగ్గును దూరం చేస్తాయని టాక్.

సకినాలు

ఇదొక మంచి స్నాక్‌ ఐటెమ్. బియ్యం, శనగపిండి, ఉప్పు, కారం మాత్రమే వేసి చేస్తుంటారు కొందరు. ఇంకొన్ని చోట్ల వాము, నువ్వులు కూడా కలుపుతారు. శనగపిండిలో ఫైబర్‌ జీర్ణక్రియకు మంచిది.

జంతికలు

నువ్వులు, బెల్లం కలిపి తయారు చేస్తారు. ఇందులో ఎన్నోరకాల ప్రోటీన్స్‌, విటమిన్స్‌ ఉంటాయి. బెల్లంలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఉపయోగపడుతుందట.

నువ్వుల ఉండలు

సున్నండలు మినుములతో చేయటం వల్ల శక్తిని ఇస్తాయి. మినపప్పు కావాల్సినంత పోషకాలను శరీరానికి అందిస్తుంది. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి వస్తుందని పెద్దలు చెబుతుంటారు.

సున్నుండలు

పండగకి ఏం వండుతున్నారంటే కజ్జికాయలు పేరు చెప్పకుండా ఉండరు. కొబ్బరి, రవ్వ, పంచాదారతో పాటు యాలకులు, జీడిపప్పు ఉపయోగిస్తారు. ఇందులో ప్రోటీన్స్‌, ఐరన్, ఖనిజ లవణాలు లభిస్తాయని నానుడి.

కజ్జికాయలు

వేడివేడి గారెల్లో నాటుకోడి మాంసం వేసుకొని తింటే ఆ టేస్ట్‌ అదిరిపోతుంది. మినపపొట్టుతో ఉన్న గారెలు ఆరోగ్యానికి చాలా మంచిదట. మినుముల్లో ఉండే మాంసకృత్తులతో పాటు ప్రోటీన్లు, పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గారెలు

బియ్యంపిండి, కొబ్బరి, నువ్వుల పిండి, బెల్లం ఉపయోగిస్తారు. పాకం పట్టేందుకు పంచదార లేదా బెల్లం వాడతారు. అరిసెల తర్వాత అంతటి రుచిని అందిస్తాయి. కార్బొహైడ్రేట్లు కొబ్బరి బూరెల్లో పుష్కలంగా లభిస్తాయి.

కొబ్బరి బూరెలు