Sarfarz Khan: రంజీల్లో వరుస సెంచరీలు.. అయినా టీమిండియాలో దక్కని ఛాన్స్

YouSay Short News App

సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం దేశవాలీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్న ఆటగాడు. టీమిండియాలో చోటు కోసం పరితపిస్తున్నాడు.

రంజీల్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా నిలుస్తున్నాడు ఈ ముంబై బ్యాట్స్‌మన్. 2022-23 సీజన్‌లో ఇప్పటివరకు 3 సెంచరీలు బాదాడు.

దేశవాళీల్లో రాణిస్తున్నా టీమిండియా టెస్టు జట్టులో సర్ఫరాజ్‌కు చోటు దక్కడం లేదు. ఫిబ్రవరిలో జరిగే ‘బోర్డర్-గవాస్కర్’ ట్రోఫీకి సర్ఫరాజ్‌ని ఎంపిక చేయలేదు.

టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏడ్చేశాడు కూడా. తన రికార్డులను ఇన్‌స్టాలో పోస్టు చేసి బాహాటంగానే సెలక్షన్ కమిటీని పరోక్షంగా ప్రశ్నించాడు.

గత మూడు రంజీ సీజన్ల నుంచి సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఈ 3 సీజన్లలో ఏకంగా 12 సెంచరీలు బాదడం విశేషం. ఇందులో ఒక ట్రిపుల్, ఒక డబుల్ సెంచరీలున్నాయి.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు 37 మ్యాచులు(53 ఇన్నింగ్సులు) ఆడాడు. అతడి బ్యాటింగ్ సగటు 81.51గా ఉంది. ఆసీస్ బ్యాట్స్‌మన్ బ్రాడ్‌మన్‌(95.14) తర్వాత ఉన్నది  మన సర్ఫరాజే.

2020 తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మన్ సర్ఫరాజే(12). జో రూట్(13), మార్నస్ లబుషేన్(15) ముందున్నారు.

సర్ఫరాజ్ కొంతకాలం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించాడు. కానీ, ఆ జట్టు తరఫున కేవలం 8 మ్యాచులు మాత్రమే ఆడాడు. మొత్తంగా 2019 వరకు 11 మ్యాచులు మాత్రమే ఆడాడు.

ముంబై జట్టుకు మారిన అనంతరం సర్ఫరాజ్ ప్రదర్శన మెరుగైంది. తొలి మ్యాచులోనే ట్రిపుల్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అది కూడా ఉత్తర్‌ప్రదేశ్‌పైనే చేయడం గమనార్హం.

సర్ఫరాజ్ ఖాన్‌ని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై పలువురు మాజీలు సెలక్షన్ కమిటీని తప్పు పట్టారు. క్రికెట్ అభిమానులు కూడా సర్ఫరాజ్‌కు మద్దతు తెలిపారు.

సర్ఫరాజ్‌ని టీమిండియాకు ఎంపిక చేయకపోవడం దేశవాలీ టోర్నీలను అవమానించినట్లేనని వెంకటేశ్ ప్రసాద్ వ్యాఖ్యానించాడు. బరువే అతడి సమస్య అయితే, ప్రస్తుతం టీమిండియాలో సర్ఫరాజ్ కన్నా బరువున్న వాళ్లున్నారని కామెంట్ చేశాడు.

దేశవాలీ మ్యాచులకు, అంతర్జాతీయ మ్యాచులకు కాస్త తేడా ఉంటుంది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోటీ కూడా ఎక్కువే.

మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ చాలా లావుగా ఉండటమే అతడి సెలక్షన్‌పై ప్రభావం చూపిస్తోందని కొందరి వాదన.

సర్ఫరాజ్‌కు టీమిండియాకు ఎంపిక కావడానికి ఇంకా ఛాన్సులున్నాయి. ఆసీస్ సిరీస్‌కు తొలి రెండు టెస్టులకు మాత్రమే బీసీసీఐ జట్టును ప్రకటించింది. మెరుగ్గా రాణిస్తే మిగతా రెండు టెస్టులకు జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది.

గత 3 రంజీ సీజన్లలో సర్ఫరాజ్ ప్రదర్శన