సోషల్‌ మీడియాలో స్క్రోల్‌ చేస్తూనే ఉన్నారా?

YouSay Short News App

DOOMSCROLLING  బారిన పడుతున్నారేమో జాగ్రత్త!

మన మెదడు మంచి కన్నా చెడునే త్వరగా తీసుకుంటుంది. అందుకే సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ వార్తలకన్నా నెగెటివ్‌ వార్తలకే డిమాండ్‌ ఎక్కువ. ఏదైనా ఒక నెగెటివ్‌ ముచ్చట చూస్తే.. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనే కుతూహలం మనకు పెరుగుతుంది.

ఇలా తెలుసుకనే క్రమంలో అదే పనిగా గంటల తరబడి స్క్రోల్‌ చేయడాన్నే.. DOOMSCROLLING లేదాDOOM SURFING అంటాం. దీని బారిన పడితే మానసిక ఆరోగ్యపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా సమయంలో డూమ్‌ స్క్రోలింగ్‌ కారణంగా ఎంతోమంది మానసిక రోగాల బారిన పడ్డారని నివేదికలు చెబుతున్నాయి. ఎవరో ఏదో షేర్‌ చేస్తూ దానిని నమ్మి ఎంతో మంది ఆందోళనకు గురయ్యారు.

కొన్న చెడు, అవాస్తవ వార్తలు మరణం, హింస చూసినపుడు ఒక రకమైన నెగెటివ్‌ ఇంపాక్ట్‌ ఉంటుంది. అది మన జీవితంలోనూ జరుగుతుందేమో అన్న ఆలోచన మరింత కుంగదీస్తుంది.

చెడు వార్తల గురించి తెలుసుకుంటున్న క్రమంలో మనలో కోపం పెరుగుతుంది. అది తీవ్రమై మనకే శత్రువుగా మారుతుంది.

అప్పటికే మానసిక సమస్యలతో ఉన్నవారికి.. ఉన్నట్టుండి చెమట పట్టడం, శ్వాస అందకపోవడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

రాత్రిపూట నెగెటివ్‌ వార్తలను చూడటం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఒత్తిడిని పెంచే హర్మోన్‌ల స్థాయిలు పెరుగుతాయి. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.

ఎక్కువసేపు ఫోన్‌తో గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు.. ఆకలి హరించివేస్తాయని, సెల్ఫ్‌ ఎస్టీమ్‌ను దెబ్బతీస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడుపడితే అప్పుడు సోషల్‌ మీడియాలో కాలం గడపకుండా.. ప్రత్యేకించి టైం టేబుల్‌ పెట్టుకోండి. కొంత సమయం కేటాయించి ఆ టైంలోనే సోషల్ మీడియాను చూడండి

రాత్రిపూట ఫోన్ అస్సలు వాడొద్దు. పడుకునే గంట ముందే ఫోన్‌ను దూరంగా పెట్టేయండి

టైంపాస్‌ కోసం ఫోన్‌ చూడొద్దు. అందుకు స్నేహితులతో ముచ్చట్లు, యోగా, ధ్యానం, అలా పార్కులో తిరగడం వంటివి చేయండి

నెగెటివ్‌ వార్తల గురించి చూడటం కంటే మీ కెరీర్‌కు పనికొచ్చేవి చూడండి. మీకు మానసిక ప్రశాంతతను పెంచే కంటెంట్‌ను వీక్షించండి.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.