సెన్సేషన్‌

2022 వరల్డ్‌ కప్‌లో

సృష్టించిన మ్యాచ్‌లు

అక్టోబర్‌ 26న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఐర్లాండ్‌ షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ 157 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో 14.3 ఓవర్లలో 105/5 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ వర్షం కారణంగా DLS పద్ధతిలో 5 పరుగులతో ఓటమి పాలైంది

ENG Vs IRE Oct 26

ఇండియాతో ఓటమితో గాయపడిన పాక్‌కు జింబాబ్వే మరో గాయం చేసింది. ఫైనల్‌ ఓవర్‌ థ్రిల్లర్‌లో జింబాబ్వే కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం నమోదు చేసి, పాక్‌ జట్టుకు షాక్ ఇచ్చింది.

PAK Vs ZIM Oct 27

సెమీస్‌ బెర్తు ఖాయమనుకున్న సౌతాఫ్రికాకు చివర్లో నెదర్లాండ్స్‌ ఇచ్చిన పంచ్ మాయని గాయం చేసింది. ప్రోటీస్‌ సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చిన్న జట్టు అయిన నెదర్లాండ్స్‌ 13 పరుగులతో ఓడించింది

SA Vs NED Nov 06

రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌ను క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో స్కాంట్లాండ్ 42 పరుగులతో ఓడించింది. హోల్డర్‌ మినహా ఎవరూ కనీసం 20 పరుగులు దాటలేకపోయారు.

SCO VS WI Oct 17

గ్రూప్‌ A తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు నమీబియా షాక్‌ ఇచ్చింది. ఆసియా కప్‌ గెలిచి జోరు మీదున్న లంక జట్టుపై నమీబియా 55 పరుగులతో విజయం సాధించింది

NAM Vs SL  Oct 16

క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు ఐర్లాండ్‌ కూడా కోలుకోలేని దెబ్బతీసింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 1 వికెట్‌ కోల్పోయి ఛేదించింది.

WI Vs IRE Oct 21

సౌతాఫ్రికా సెమీస్‌ బెర్తును ముంచిన మ్యాచుల్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ కూడా ఉంది. 9 ఓవర్లలో జింబాబ్వే 79 పరుగులు చేసింది. సౌతాఫ్రికా 3 ఓవర్లలోనే 51 పరుగులు చేసింది. కానీ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయింది.

SA Vs ZIM Oct 24

ప్రస్తుతం వరల్డ్‌ కప్‌ సెమీస్‌కు న్యూజిలాండ్, ఇంగ్లండ్‌, ఇండియా, పాకిస్తాన్‌ చేరుకున్నాయి

బుధవారం న్యూజిలాండ్‌తో పాకిస్తాన్‌, గురువారం  ఇంగ్లండ్‌తో ఇండియా తలపడనున్నాయి

Semifinals:  PAK Vs NZ  & IND Vs ENG

ఇండియా, పాకిస్తాన్‌ సెమీస్‌లో విజయం సాధిస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య రసవత్తరమైన ఫైనల్ చూడొచ్చు

IND VS Pak Final?