ఈ 7 సినిమాలు... కిరీటాలు తప్పక చూడండి

‘కీర్తి’

‘మహానటి’తో కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకుంది. అలనాటి ‘సావిత్రి’ పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    మహానటి- ప్రైమ్ వీడియో

ఈ సినిమాతో తనలోని నటిని బయట పెట్టింది. సివంగిలా కనిపించి ప్రేక్షకుడి చేత చప్పట్లు కొట్టించుకుంది.

సాని కాయిదం- ప్రైమ్ వీడియో

తెలుగులో తొలి సినిమాతోనే హిట్టు కొట్టింది. తన అందం, అమాయకత్వంతో అభిమానుల మనసు దోచేసింది

       నేను శైలజ- హాట్‌స్టార్

కోర్టు గదిలో సాగే సన్నివేశాల్లో కీర్తి అత్యద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది.

            వాశి- నెట్‌ఫ్లిక్స్

ఇందులో కీర్తి విభిన్న షేడ్స్‌ని చూపించింది. సంప్రదాయబద్ధంగా, మోడ్రన్‌గా కనిపిస్తూ మహేశ్ సరసన మెప్పించింది.

సర్కారు వారి పాట- ప్రైమ్ వీడియో

కీర్తి కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమా ఇది. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిపోతుంటుంది.

            రెమో- హాట్‌స్టార్

గర్భవతిగా తన నటనలోని మరో పార్శ్వాన్ని బయటపెట్టింది. తన పర్ఫార్మెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    పెంగ్విన్- ప్రైమ్ వీడియో