వేద మంత్రాలకు EDM ( Electronic Dance Music)ను మిక్స్ చేసి..మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లగల సమర్థులే ఈ శాంతి పీపుల్ మ్యూజిక్ బ్యాండ్.
వీరి పాటలు వింటే తన్మయమే!
రవితేజ తర్వాతి చిత్రం ‘రావణానాసుర’ నుంచి ‘దశకంఠా రావణా…’ అంటూ విడుదలైన టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియా ఊగిపోతోంది. అసలు ఇందులో ఉన్నఅమ్మాయిల వాయిస్ అద్భుతం అంటోంది. ఆ మ్యాజికల్ వాయిస్ ఈ శాంతి పీపుల్‌దే.
భారతీయులు కాకపోయినా వీరు చేసిన పాటలన్నీ వైదిక మంత్రాలతోనే. ప్రపంచమంతా వీరు ప్రోగ్రామ్స్ చేశారు. చేస్తూనే ఉన్నారు.
భారత్‌లో సంగీతమంటే పవిత్ర శబ్దం, ధ్యానప్రక్రియలో ఒక సాధనం. అలాంటి భారతీయ సంగీతమే తమలో స్ఫూర్తి నింపిందని శాంతి పీపుల్ మ్యూజిక్ బ్యాండ్ చెబుతోంది.
‘ఉమ’..ఈ శాంతి పీపుల్ బ్యాండ్‌ను ముందుండి నడిపించే మహిళ. వేదమంత్రాలు మనలో ఆందోళనలు తొలగించడమే కాదు. మనలో శాంతిని నింపుతాయని ఆమె నమ్ముతారు.
సన్‌బర్న్ ఫెస్టివ్, ఓజోరా, వరల్డ్ ట్రాన్స్ వింటర్, సమ్మర్ నెవర్ ఎండ్స్, గోగోల్‌ఫెస్ట్, వేద లైఫ్,Inne Brzmienia, రాధాదేశ్, సమ్మర్ హోళీ ఫెస్టివల్, హెడోనిజం, యూరోవిజన్ విలేజ్ కీవ్, ఎక్స్పీరియన్స్ ఫెస్టివల్ ఇలా వరల్డ్ ఫేమస్ ఫెస్టివల్స్‌లో వీరి కన్సర్ట్‌లు జరిగాయి.
జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్, బెల్జియం, చెక్ రిపబ్లిక్, పోలండ్, ఉక్రెయిన్, ఇండియా ఇలా చాలా దేశాల్లో వీరి వేద సంగీతాన్ని వినిపించారు. హైదరాబాద్‌లో వీరి ప్రోగ్రాంలు జరిగాయి.
ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ నిర్వహించారు. ఫిబ్రవరి 11న మళ్లీ వైజాగ్‌లో జరగబోతోంది. ఫిబ్రవరి 10న జైపూర్, 18 అహ్మదాబాద్‌లోనూ శాంతి పీపుల్ కన్సర్ట్‌లు జరగబోతున్నాయి.
“రావణాసురా దశకంఠా..” మీ మనసును ఆక్రమించేసిందా. అయితే శాంతి పీపుల్ చేసిన
ఈ పాటలు కూడా వినండి. మీకు తప్పక నచ్చుతాయి