శర్వానంద్- రక్షితారెడ్డి నిశ్చితార్థం... రక్షితా రెడ్డికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?

YouSay Short News App

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలో  తన సింగిల్ లైఫ్‌కు స్వస్తి చెప్పనున్నాడు

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రక్షితా రెడ్డితో నిశ్చితార్థం జరిగింది

మెగాస్టార్ చిరంజీవి దంపతులు కొత్త జంటకు దీవెనలు అందించారు.

అతిథులు

రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. రామ్ చరణ్.. శర్వానంద్ చిన్ననాటి స్నేహితులు.

రామ్‌చరణ్‌తో పాటు నాగార్జున, రానా దగ్గుపాటి పలువురు సెలబ్రెటీలు శర్వా- రక్షిత జంటను శుభాకాంక్షలు చెప్పారు.

తన గర్ల్‌ఫ్రెండ్ అదితి రావు హైదరీతో వచ్చిన సిద్ధార్థ్ శర్వానంద్ కపుల్స్‌తో ఫొటో దిగాడు

శర్వానంద్ కాబోయే భార్య రక్షితా రెడ్ది తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె.

రక్షితా రెడ్డి ఎవరు?

రక్షితా రెడ్డి ఏపీ మాజీ మంత్రి  బొజ్జల గోపాలకృష్ణారెడ్కికి మనవరాలు

పెళ్లి రోజు త్వరలో  ప్రకటించనున్నారు. మంచి ముహూర్తాలు ఉండటంతో ఫిబ్రవరిలోనే ఈ జంట ఒక్కటయ్యే అవకాశం ఉంది

ఎమ్మార్వీ ప్రసాద్ రావు- వసుంధర దేవీ దంపతులకు 1984, మార్చి 6న విజయవాడలో జన్మించారు. పుట్టింది విజయవాడలో అయినప్పటికీ హైదరాబాద్‌లోనే పెరిగారు.

శర్వానంద్ గురించి ఇవి తెలుసా.?

పుట్టిన రోజు ఎప్పుడు..?

బాల్యం, విద్యాభ్యాసం అంత ఇక్కడే పూర్తి చేసుకున్నారు. శర్వానంద్‌కి  అన్న, సోదరి ఉన్నారు. ఇతడి తండ్రి వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.

వయస్సు 38 సంవత్సరాలు. ఎత్తు 5’11(1.8 మీటర్లు) అడుగులు

వయస్సు, ఎత్తు ఎంత?

శర్వానంద్ 30కి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు.ఇతడి కెరీర్ తొలినాళ్లలో అంత చెప్పుకోదగిన హిట్లు లేనప్పటికీ ప్రస్థానం మూవీతో మంచి గుర్తింపు దక్కింది.

ఎన్ని సినిమాల్లో హీరోగా నటించాడు..?

రన్ రాజా రన్, శతమానంభవతి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జాను తదితర సినిమాలు హిట్ కొట్టాయి.

అలాగే కాదల్న సుమ్మ ఇల్లై, నల్లై నమ్‌దే, ఎంగియుం ఎప్పొద్దుం లాంటి తమిళ సినిమాల్లో కూడ నటించి చక్కని గుర్తింపు పొందాడు.

హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకున్నప్పటికీ తన తండ్రి ఒప్పుకోలేదట. కాని చివరికి అతడిని ఒప్పించి సినీ రంగ ప్రవేశం చేశాడు.

బాల్య నటుడిగా ప్రస్థానం ఎప్పుడు..?

శర్వానంద్ తొలుత థమ్స్ అప్ యాడ్‌లో చిరంజీవి సరసన నటించాడు.

ఐదో తారీఖు అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.. అది అంతగా సక్సెస్ కానప్పటికీ ప్రస్థానం, సంక్రాంతి, లక్ష్మి, శంకర్‌ దాదా ఎంబీబీఎస్, వెన్నెల, గమ్యం చిత్రాల్లో నటుడిగా అందరినీ మెప్పించాడు.

శర్వానంద్ ఇప్పటి వరకు 30కి పైగా సినిమాల్లో నటించాడు. కో అంటే కోటి అనే మూవీకి నిర్మాతగా కూడ వ్యవహరించాడు.

కుటుంబ సభ్యులు ముద్దుగా ఆనంద్, నందు అనే పేర్లతో పిలుస్తారు. అభిమానులు ప్రేమతో శర్వా అని సంభోదిస్తారు.

శర్వానంద్ ముద్దు పేర్లు ఏంటి..?

అవతార్, టైటానిక్, సంక్రాంతి మూవీలంటే ఇష్టం

ఇష్టమైన మూవీ ఏది..?

సౌతిండియన్, గుజరాతీ, కొంకణ్, చైనీస్ ఫాస్ట్‌పుడ్ అంటే ఇష్టం. నచ్చిన పుస్తకాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. డ్యాన్సింగ్, ఫొటోగ్రపీ, క్రికెట్, బ్యాడ్మింటన్‌లను వ్యాపకాలుగా మార్చుకున్నాడు.

ఇష్టమైన ఫుడ్, అభిరుచులు?

ఎంగియం ఏ పొద్దుం అనే తమిళ సినిమాలో నటించి బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో SIIMA అవార్డు సాధించాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది.

అవార్డులు ?