Shivam Mavi: T20ల్లో ఉత్తమ  డెబ్యూ బౌలర్‌గా నిలిచిన శివం మావి

YouSay Short News App

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అరంగేట్ర బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. 4 ఓవర్లు వేసి  4 వికెట్లు తీసుకున్నాడు. కీలక సమయంలో బ్యాట్స్‌మన్‌ని ఔట్ చేసి టీమిండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.

జాతీయ జట్టుకు ఆడటమనేది చాలామంది ఆటగాళ్ల కల. అయితే, తొలి మ్యాచులో ఒత్తిడితో ప్లేయర్లు సహజ ఆట శైలిని కోల్పోయి రాణించలేకపోతారు. కానీ, కొందరు మాత్రం అవకాశాన్ని అందిపుచ్చుకుని మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు.

టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శివమ్ మావి కూడా ఈ కోవకే చెందుతాడు. ఇలా t-20Iలో అరంగేట్ర మ్యాచులోనే అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.

అరంగేట్ర మ్యాచులో అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిలో పడిన ఆటగాడు బరిందర్ శరన్.  2016లో జింబాబ్వేపై నిప్పులు చెరుగుతూ  4 వికెట్లను తీసుకున్నాడు. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

బరిందర్ శరన్

ఈ ప్రదర్శనతో శరన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెల్చుకున్నాడు. కానీ, ఈ సిరీస్ తరువాత శరన్ టీ20ల్లో మళ్లీ కనిపించకపోవడం సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది.

2009లో టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసి అలరించిన బౌలర్ ప్రగ్యాన్ ఓజా. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్ లైనప్‌ని కూల్చుతూ 4 వికెట్లు తీసుకున్నాడు.

ప్రగ్యాన్ ఓజా

4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు ఇచ్చాడు. అంతేగాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచులోనూ టీమిండియా విజయం సాధించింది.

2023లో శ్రీలంకతో అరంగేట్రం చేసిన శివం మావి 4 వికెట్లు తీసుకుని ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసి 22 పరుగులు సమర్పించుకున్నాడు.

శివం మావి

ఉత్తమ ప్రదర్శన చేసిన టీమిండియా డెబ్యూ బౌలర్లలో శివం మావి మూడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచులో టీమిండియా 2 పరుగుల తేడాతో గెలుపొందింది.

స్వింగ్ బౌలర్‌గా తనేంటో అరంగేట్ర మ్యాచులోనే నిరూపించుకున్నాడు భువనేశ్వర్ కుమార్. 2012లో పాకిస్థాన్‌తో మ్యాచులో భువి జట్టులోకి వచ్చాడు. 4 ఓవర్లలో 3 వికెట్లు తీసుకుని  9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

భువనేశ్వర్ కుమార్

తన ప్రదర్శనతో భువనేశ్వర్ ఆకట్టుకున్నప్పటికీ  ఈ మ్యాచులో టీమిండియా పరాజయం పాలైంది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన  ఈ సమరంలో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

భారత జట్టుకు 2019లో అరంగేట్రం చేసిన నవదీప్ సైని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో 4 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లను తీసుకున్నాడు.

నవదీప్ సైని

ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచులో సైని వికెట్లను పడగొట్టడమే కాక.. పొదుపుగానూ బంతులేశాడు. 24బంతులేసి కేవలం 17 పరుగులే సమర్పించుకున్నాడు.  దీంతో ఈ మ్యాచులో టీమిండియా విజయం సాధించింది.

2017లో జింబాబ్వేతో మ్యాచులో జట్టులోకి వచ్చిన ఆటగాడు అక్షర్ పటేల్. 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసుకున్నాడు. 17 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టీమిండియా 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అక్షర్ పటేల్