ఇటీవల ‘చుప్’తో వెండితెరపై మెరిసిన ఈమె హాట్ ఫోటోలు చప్పున కుర్రకారు మదిని దోచుకుంటున్నాయి.
ఫ్యాషన్ ప్రపంచం తన సొగసును పొగడకుండా ఉండలేకపోతోంది. టాప్‌లెస్ ఫోటోలు వచ్చినా తన ముఖారవిందాన్ని కనువిందుగా అభివర్ణిస్తున్నారు.
హైదరాబాద్‌లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలివుడ్‌లో బిజీగా గడుపుతోంది. సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు చేస్తూ కెరీర్ ముందుకు తీసుకెళ్తోంది.
హైదరాబాద్‌లో పుట్టిన శ్రేయ, దిల్లీ, ముంబయిలో పెరిగింది. NIT వరంగల్ నుంచి డిగ్రీ పట్టా పొందింది.
కళాశాల రోజుల నుంచే నటన అన్నా మోడలింగ్ అన్నా చాలా ఆసక్తిగా ఉండేది. చదువుకునే రోజుల్లోనే ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008లో పోటీ పడింది.
మిస్ ఇండియా 2008కి శ్రేయ ఫైనలిస్ట్.
జోష్ (2009) సినిమాతో సహాయ నటిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. "స్నేహ గీతం" (2010)లో ప్రధాన పాత్ర పోషించింది.
టాలివుడ్‌లో అంతగా గుర్తింపు దక్కకపోవడంతో బాలివుడ్‌కు అడుగులేసింది.
సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ నటించిన "వై చీట్ ఇండియా" చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనతో ఉన్నప్పటికీ శ్రేయ తన నటనకు ప్రశంసలు అందుకుంది.
"స్కామ్ 1992," "ఫ్యామిలీ మ్యాన్," వంటి అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో కనిపిస్తూ క్రమంగా బాలీవుడ్ మెట్లు ఎక్కింది.
శ్రేయ కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. 'ది వైరల్ వెడ్డింగ్' అనే వెబ్ సిరీస్‌కు రచన, దర్శకత్వంతో పాటు నిర్మించింది మరియు నటించింది. ఈ వెబ్ సిరీస్ నటికి చాలా ప్రశంసలను తెచ్చిపెట్టింది.
2022లో శ్రేయ మంచి విజయాలను అందుకుంది. అందులో దుల్కర్ నటించిన ‘చుప్’ సినిమా చక్కటి విజయాన్నందుకుంది.
ప్రస్తుతం ‘అద్భుత్’, ‘గన్స్ అండ్ గులాబ్స్’లో నటిస్తూ బిజీగా ఉంది.
సుస్మితా సేన్, దియా మీర్జా మరియు టబు ఇలా బాలీవుడ్‌లో రాణించిన హైదరాబాద్‌లో జన్మించిన నటీమణుల వరుసలో శ్రేయ చేరింది.
యూసే తరఫున శ్రేయకు తన భవిష్యత్ ప్రాజెక్ట్‌లకు శుభాకాంక్షలు.