YouSay Short News App
లేడీ బాస్‌గా మారిన శృతిహాసన్
రెండు వరుస విజయాలతో లేడీ బాస్ శృతిహాసన్ మరోసారి ఇండస్ట్రీలో తన మ్యాజిక్ ప్రదర్శించింది.
ఇటీవల తాను నటించిన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలవడంతో ఇటు ప్రజల్లో, అటు బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసింది.
శృతి బుహుముఖ ప్రజ్ణాశాలి. నటిగానే కాకుండా పాటలు, డ్యాన్స్, మ్యూజిక్, మోడల్ ఇలా అన్ని రంగాల్లో తన టాలెంట్ చూపిస్తోంది.
ఫ్యాషన్ రంగంలో శృతిహాసన్ తనదైన స్టైల్‌తో దూసుకుపోతోంది. శృతికి సంబంధించిన కొన్ని అవుట్‌ఫిట్స్ మనం చూడవచ్చు.
శృతిహాసన్‌కు నలుపు రంగు అంటే పిచ్చి. బ్లాక్ కలర్‌కు ఆమెకు విడదీయరాని బంధం ఉంది. తరచుగా బ్లాక్ డ్రెస్‌నే ఆమె ధరిస్తూ ఉంటుంది.
బ్లాక్ డ్రెస్‌లో శృతి మధ్య ఆసియా యువరాణిలా వెలిగిపోతోంది. తన కొంటె చూపులు మిమ్మల్ని చూపు తిప్పుకోనివ్వవు.
అస్సామీ చీరలో శృతి అదరగొట్టింది. తలపై ఆభరణం ఆమెకు మరింత అందం తీసుకువచ్చింది.
లెదర్ బ్లాక్ డ్రెస్‌లో శృతి మెరిసిపోయింది.
తలపై బ్యాండ్ ధరించి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఈ ‘క్రాక్’ నటి బాంద్రా గర్ల్‌లా బ్లాక్ కలర్ డ్రెస్‌లో హాట్ హాట్‌గా కనిపించింది.
శృతి స్ట్రీట్ ఫ్యాషన్ ఇష్టపడుతుందని మనందరికీ తెలిసిన విషయమే. బ్లాక్ మిడ్డీలో శృతి అందాలు ఆరబోస్తూ కనిపించింది.
ఈ ‘వీరసింహారెడ్డి’ నటి బ్లాక్ కలర్ లాంగ్ సైజ్ టీ షర్ట్‌లో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఈ డ్రెస్‌లో శృతి అభిమానులను కవ్విస్తున్నట్లుగా ఉంది.
బ్లాక్ కలర్ పొట్టి గౌనులో శృతి స్టైలిష్‌గా బార్బీ డాల్‌లా అదరగొట్టింది.
సిల్క్ చొక్కా, సిల్క్ ప్యాంట్‌లో ఈ దక్షిణ భారత నటి ట్రెండీగా కనపడుతోంది.
ఒకవేళ ఈ లేడీ బాస్ నలుపు కాకుండా వేరే రంగును ఎంచుకోవాలంటే మాత్రం తళతళ మెరిసే దుస్తులనే ఎంచుకుంటుంది.
శృతి ఎప్పుడూ లైట్ మేకప్, హీల్స్, డెనిమ్ దుస్తులతో దర్శనమిస్తుంది.
దేవత!