శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ 2023 వరల్డ్‌కప్‌లో స్థానం పక్కానా!

YouSay Short News App

అక్టోబర్‌లో స్వదేశంలో జరగబోతున్న ICC వన్డే వరల్డ్‌కప్‌నకు టీమిండియా సన్నద్ధత మొదలుపెట్టింది. ఆటగాళ్ల కూర్పు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి వేళ శుభ్‌మన్‌ గిల్‌ తన సత్తా చాటుతూ స్థానం ఖాయం చేసుకునే దిశగా సాగుతున్నాడు.

బుధవారం హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అద్భుత ద్విశతకతంతో గిల్‌ చెలరేగి ఆడాడు. 145 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ చేసిన గిల్‌..208 పరుగులు చేసి ఔటయ్యాడు.

టీమిండియాలో ఓపెనింగ్‌ స్పాట్‌కు గట్టిపోటీ ఉంది. జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ ఎలాగూ ఆ స్థానంలోనే కొనసాగుతాడు. మరోవైపు ఇషాన్ కిషన్‌, దేశవాళీలో అదరగొడుతున్న పృథ్వీ షాలతో గిల్‌ పోటీ పడుతున్నాడు.

ఇషాన్ కిషన్‌ కూడా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. డిసెంబర్‌ 2022లో బంగ్లాతో జరిగిన సిరీస్‌లో ఇషాన్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. బుధవారం మ్యాచ్‌లో ఇషాన్‌ను కూడా తీసుకుని నాలుగో స్థానంలో ఆడించారు. కానీ విఫలమయ్యాడు.

షాన్‌దార్‌ ఇషాన్‌

మరోవైపు జాతీయ జట్టులో చోటు దక్కకపోయినా ఇటీవల రంజీ ట్రోఫీలో 379 పరుగులు బాదిన పృథ్వీ షా కూడా జాతీయ జట్టులో చోటు కోసం కాచుకుని కూర్చున్నాడు.

పృథ్వీ పడిగాపులు

గిల్‌ మాత్రం తనకు అందివచ్చిన అవకాశాలను చక్కగా ఒడిసిపడుతున్నాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ద్విశతకం బాది వన్డేల్లో అరుదైన రికార్డులు సాధించాడు.

రికార్డుల గిల్‌

శుభ్‌మన్ గిల్‌ కేవలం 19 ఇన్నింగ్స్‌లోనే మూడో శతకం సాధించాడు. టీమిండియా తరఫున అత్యల్ప ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు సాధించిన వారిలో శిఖర్‌ ధావన్‌ (17 ఇన్నింగ్స్) ఒక్కడే గిల్‌ కన్నా ముందున్నాడు.

మూడో శతకం

టీమిండియా తరఫున వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా గిల్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు కోహ్లీ, ధావన్‌ 24 ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు సాధించారు.

ఫాస్టెస్ట్ 1000

వన్డేల్లో ప్రస్తుతం గిల్‌ 68.88 సగటుతో కొనసాగుతున్నాడు. అంటే దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో అర్ధశతకానికి పైగా బాదినట్లే.

సూపర్ యావరేజ్

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత రికార్డు నమోదు చేశాడు. ఇప్పటిదాకా  ఈ గ్రౌండ్‌లో  2009లో ఆస్ట్రేలియాపై సచిన్‌ 186 పరుగులు హైయెస్ట్‌ స్కోర్‌గా ఉంది. గిల్ ఆ రికార్డును అధిగమించి డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించాడు.

ఉప్పల్‌ రికార్డు బద్దలు

                 ఇన్నింగ్స్‌          - 19                 పరుగులు         -  1102                 హైయెస్ట్ స్కోర్     -  208                 యావరేజ్‌         -  68.88                 సెంచరీలు         -  3             డబుల్‌ సెంచరీ         -  1                 అర్ధశతకాలు       -  5

వన్డేల్లో గిల్‌

కొన్ని రోజులుగా గిల్ ఆటను చూస్తుంటే వన్డే వరల్డ్‌ కప్‌లో అతడి స్థానం పక్కా అని దిగ్గజాలతో పాటు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్లేస్ పక్కా

గిల్‌ స్కిల్‌పై ఎప్పుడూ అనుమానం లేదు. కానీ ఇప్పుడు అతడు దానికి స్థిరత్వాన్ని జత కట్టాడు. అతడి ఆటను చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోందంటూ ప్రశంసిస్తున్నారు.

Skill weds consistency

రానున్న రోజుల్లో టీమిండియా వరుస సిరీస్‌లో ఆడబోతున్న వేళ గిల్‌, ఇషాన్‌, పృథ్వీ షాలలో ఎవరు నిరూపించుకుంటారో! ఎవరిని ఓపెనింగ్ స్లాట్‌ వరిస్తుందో వేచిచూడాలి.

ఎవరికో మరి!