SIR MOVIE REVIEW:  ధనుష్ తెలుగులో హిట్ కొట్టినట్లేనా? కొత్తగానే ఉంది కానీ…

YouSay Short News App

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన సార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్లలో విడుదలైంది. ఆయనకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది.

అందులోనూ ఈసినిమాను తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించడంతో సినిమాపై హైప్ పెరిగింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? ఓసారి సమీక్షిద్దాం..

త్రిపాఠి అనే ప్రేవేటు జూనియ‌ర్ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా  ధనుష్( బాలగంగాధర్ తిలక్) పనిచేస్తుంటాడు. కొన్ని కార‌ణాల‌తో సిరిపురంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీకి మ్యాథ్స్ లెక్చరర్‌గా వెళ్తాడు.

కథ

కాలేజీకి వెళ్లిన బాలుకి అక్క‌డి విద్యార్థుల  త‌ల్లిదండ్రులు వారి పిల్లలను కాలేజీ కంటే పనికి పంపడమే మేలని భావిస్తారు.

అక్కడ బయాలజీ లెక్చర్‌ మీనాక్షి(సంయుక్త మీనన్)తో కలిసి బాలు వారిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు? ఆ కాలేజీని స్టేట్‌లో నంబర్  1గా ఎలా నిలిపాడు?

బాలు చేసిన ప‌ని వ‌ల్ల త్రిపాఠి కాలేజీ అధినేత త్రిపాఠి (స‌ముద్ర ఖ‌ని)కి వ‌చ్చిన న‌ష్ట‌మేంటి? త్రిపాఠి దాడులను ధనుష్ ఎలా దాటాడు? కలెక్టర్‌ మూర్తి(సుమంత్‌ )కు బాలుకు మధ్య సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ

లెక్చరర్ పాత్రలో ధనుష్ కొంచెం క్లాస్ ఇంకొంచెం మాస్ లుక్‌తో అదరగొట్టాడు. తనదైన డైలాగ్స్ పర్ఫామెన్స్‌తో మెప్పించాడు. ఎమోషన్ సీన్స్‌లో జీవించాడు.

ఎవరేలా చేశారు?

బయాలజీ లెక్చరర్‌గా సంయుక్త తన పాత్రకు న్యాయం చేసింది. సాంప్రదాయబద్దమైన రోల్‌లో ఆకట్టుకుంది.

హైపర్ ఆది కామెడీ బాగానే ఉన్నా ఆశించిన స్థాయిలో లేకపోవడం డిస్సాపాయింట్‌గా ఉంటుంది. త్రిపాఠిగా విలన్‌ రోల్‌లో సముద్రఖని బాగా చేశారు.

తనికెళ్ల భరణి పాత్ర ఫర్వాలేదు, పబ్లిసిటీ పిచ్చి ఉన్న ఊరి అధ్యక్షుడి పాత్రలో సాయికుమార్‌ మెప్పిస్తారు. కలెక్టర్‌ మూర్తిగా సుమంత్‌ కాసేపు మెప్పించాడు.

విద్యా ప్రాథమిక హక్కు అనే లైన్‌ను సినిమాగా తీయడంలో డెరెక్టర్ వెంకీ అట్లూరీ సక్సెస్ అయ్యాడు. స్క్రీన్‌ప్లే చాలా బాగా తీశాడు. డైలాగ్‌లు చాలా నీట్‌గా ఉన్నాయి. కథ కొత్తగా ఉన్నా పాత సినిమాలను గుర్తు చేసేలా ఉండటం మైనస్.

దర్శకత్వం

సెకండాఫ్‌లో సీన్లు ముందే ఊహించే విధంగా ఉన్నాయి.సందేశాత్మక చిత్రమైనా కొత్తగా చెప్పలేకపోయాడు.

సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి. జే యువరాజ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ప్లజెంట్‌గా ఉన్నాయి. జీవీ ప్రకాష్‌ కుమార్ సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్రాణం పోశాయి. మాస్టారు మాస్లారు.. పాట చిత్రానికి మంచి ఫ్లేవర్ ఇచ్చింది.

సాంకేతికంగా

ఊహించదగిన సీన్లు కథను కొత్తగా చెప్పలేకపోవడం

బలహీనతలు

ధనుష్ నటన జీవి ప్రకాశ్ సంగీతం ఎమోషనల్ సీన్లు

బలాలు

రేటింగ్: 3/5

సందేశం ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. 1990 జనరేషన్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది.

ఫైనల్‌గా

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.