ws_Snapinsta.app_1080_320048511_3003226496650609_3529439625880170341_n

YouSay Short News App

రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసిన సీతారామం భామ మృణాల్ ఠాకూర్

ws_Snapinsta.app_1080_315558569_871991640487371_8976123626711650286_n

బ్లాక్ బాస్టర్ హిట్ సీతారామంలో తన అద్భుతమై నటనతో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

ws_Snapinsta.app_1080_315109118_519270856776835_8114148721419585861_n

దశాబ్దకాలంగా మృణాల్ బాలీవుడ్‌లో నటిస్తోంది."సూపర్ 30"లో హృతిక్ రోషన్‌తో జతకట్టింది, కానీ ఇప్పటివరకు ఈ కలువ కనుల సుందరికి బీటౌన్‌లో సరైన గుర్తింపు దక్కలేదు.

ws_FkK23hLUYAA0Jr7

టాలీవుడ్‌లో మృణాల్ కేవలం ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. తెలుగు ప్రజల ప్రేమకు మైమరిచిపోయిన ఈ భామ కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

సీతారామం విజయం మృణాల్‌కు టాలీవుడ్‌లో రాచబాట పరిచింది. తెలుగులో పెద్దఎత్తున సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ జాబితాలో ఆమె సంతకం చేయని సినిమాలే చాలా ఉన్నాయి.

నేచురల్ స్టార్ "నాని"తో తన తదుపరి ప్రాజెక్టు చేయనున్నట్లు మృణాల్ ఇటీవల ప్రకటించింది. 'నాని30'లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.

"సీతా రామం" విజయం తర్వాత ఈ హాట్ బ్యూటీ తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు తెలిసింది.

"సీతా రామంలో నటించినందుకుగాను మృణాల్ రూ. 85 లక్షలు పారితోషికంగా తీసుకుంది.

నాని సినిమా కోసం మృణాల్ రూ.కోటికి పైగా డిమాండ్ చేసినట్లు సమాచారం.

రూ.కోటి రెమ్యునరేషన్ మృణాల్ డిమాండ్ చేయడం నిర్మాతలకు ఏమాత్రం షాక్ ఇవ్వలేదు. మృణాల్ నటన, ఆకట్టుకునే తన అందానికి టాలీవుడ్ నిర్మాతలు  భారీ మొత్తాలను చెల్లించడానికి సిద్ధమయ్యారు.

నాని 30వ సినిమా కోసం ఈ భామ కాస్త  బరువు కూడా తగ్గింది.

నాని 30 సినిమా బాక్సాఫిస్ వద్ద విజయం  సాధిస్తే తెలుగులో ఈ అమ్మడి స్థానం మరింత పదిలం కానుంది.

‘నాని30’తో పాటు మరో ఐదు బాలీవుడ్ సినిమాల్లో మృణాల్ నటిస్తోంది. పూజా మేరీ జాన్, పిప్పా, రాధ, ఆంఖ్ మిచోలీ డాగర్,  గుమ్రా సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

మృణాల్ తన భవిష్యత్ నట ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని YouSay ఆకాంక్షిస్తోంది.