Skytrax Report 2024: ప్రపంచంలో టాప్ 20 విమానాశ్రాయలు… శంషాబాద్ స్థానం ఎంతంటే?
YouSay Short News App
ప్రముఖ సంస్థ స్కైట్రాక్స్ ప్రతి సంవత్సరం ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబి
తాను విడుదల చేస్తుంటుంది.
మరి ఈ జాబితాలో మొదటి 20 స్థానాల్లో ఏ విమానాశ్రయాలు నిలిచాయో ఓసారి చూద్దాం
దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయి
ర్పోర్టుగా నిలిచింది
గతేడాది అగ్రభాగాన ఉన్న సింగపూర్‌కు చెందిన ఛాంగి సెకండ్ ప్లేస్‌కు పడిపోయింది
సియోల్ ఇన్చెయాన్ విమానాశ్రయం మూడో స్థానంలో నిలవగా.. టోక్యోలోని హనీదా, నరీతా వరుసగా నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి.
ఆరో స్థానంలో చార్లెస్ డి గలే (పారిస్), ఏడో స్థానంలో దుబాయ్ (యూఏ
ఈ) విమానాశ్రయం ఉంది.
ఎనిమిదో స్థానంలో మ్యూనిచ్ (జర్మనీ), తొమ్మిదో స్థానంలో జ్యూరిక్ (స్విట్జర్లాండ్) ఏయిర్‌పోర్టు ఉంది.
పదో పొజిషన్‌లో ఇస్తాంబుల్ (టర్కీ) 11 వ ర్యాంక్‌లో హాంకాంగ్ విమానాశ్రయాలు ఉన్నాయి.
12వ స్థానంలో
ఫ్యూమిసినో (రోమ్),
13వ ర్యాంకులో వియన్నా (ఆస్ట్రియా) 14వ స్థానంలో వాంటా (హెల్సింకీ) ఉన్నాయి.
15 వ ర్యాంకులో
బరజాస్ (మ్యాడ్రిడ్)
, 16వ స్థానంలో సెంట్రైర్ నగోయా (జపాన్) ఉన్నాయి.
17వ ర్యాంకుకు
వాంకోవర్ (కెనడా)
18వ స్థానానికి కాన్సాయ్ (జపాన్) ఎయిర్‌పోర్టులు చేరుకున్నాయి.
ఇక 19వ స్థానంలో మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) 20వ స్థానంలో కోపెన్ హెగెన్ (డెన్మార్క్) ఉన్నాయి.
అమెరికాకు చెందిన విమానాశ్రయాల్లో ఒక్కటి కూడా తొలి 20 స్థానాల్లో చోటు దక్కించుకోలేదు.
టకోమా విమానాశ్రయం
పొందిన 24వ ర్యాంకే అమెరికా సాధించిన ఉత్తమ స్థానం
ఈ జాబితాలో ఢిల్లీలోని
ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టు
36వ స్థానంలో నిలిచింది.
భారత ఎయిర్‌పోర్టులు..
బెంగళూరు ఎయిర్‌పోర్టు తన ర్యాంకును 69 నుంచి 59కి మెరుగుపరుచుకుంది
అయితే దక్షిణాసియాలో అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు నిలిచింది.
ఇక హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం స్థానం 65 నుంచి 61కి పెరిగింది
అయితే సిబ్బంది సేవల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు దక్షిణాసియాలోనే అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App