రామ్‌చరణ్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

YouSay Short News App

 చెర్రీకి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయంటే

RRR సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా  అభిమానులను సంపాదించుకున్నాడు చరణ్. చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా మాత్రమే కాకుండా తనకున్న ప్రత్యేక లకణాలతో సొంత ఇమేజ్  క్రియేట్ చేసుకున్నాడు.

ఈ క్రమంలో రామ్ చరణ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు మీకోసం..

రిచర్డ్ మిల్లె RM029(రూ. 85 Lakhs)

రామ్ చరణ్ ఫెవరెట్ వాచ్?

ఫెరారీ పోర్టోఫినో (రూ.3.5 కోట్లు), రేంజ్ రోవర్ ( రూ. 3.5కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంటమ్ ( రూ. 9 కోట్లు). ఇవికాక ఇంక చాలా కార్లు చెర్రీ దగ్గర ఉన్నాయి.

రామ్ చరణ్ దగ్గర ఉన్న కార్లు?

రామ్‌చరణ్‌కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. చెర్రీకి కాజల్, బాదల్ ఆశ్వాలంటే ఇష్టం.ఇవికాక  విదేశీ బ్రీడ్‌కు చెందిన 25 గుర్రాలు చరణ్ దగ్గర ఉన్నాయి.

రామ్‌చరణ్‌ అభిరుచులు?

హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం.

రామ్‌చరణ్‌కు ఇష్టమైన ఆహారం?

రానా దగ్గుపాటి రామ్‌చరణ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌. వీరిద్దరు కలిసి ఇంట్లో తెగ అల్లరి చేసేవారని చిరంజీవి చెప్పారు.

చెర్రీ బెస్ట్ ఫ్రెండ్?

రామ్ చరణ్ నటుడు మాత్రమే కాదు పారిశ్రామికవేత్త. ఆపోలో హాస్పటల్స్‌లో రామ్‌చరణ్‌కు వాటా ఉంది. హైదరాబాద్ పోలో క్లబ్ జట్టుకు చరణ్ యజమాని. Turbo Megha Airways Pvt Ltd ఎయిర్ వేస్ కంపెనీకి చెర్రీ చైర్మన్.

రామ్ చరణ్ వ్యాపార సంస్థలు?

హైదరాబాద్- జూబ్లీహిల్స్- MCR HRD ఇన్సిట్యూట్ సమీపంలో 25,000sq.ft విస్తీర్ణంలో ఇళ్లు ఉంది. దాదాపు రూ.60 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.

రామ్ చరణ్ ఇల్లు ఎక్కడ?

రాజకీయాల నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి చేసిన తొలి సినిమా ఖైదీ నం.150ను చెర్రీ నిర్మించాడు. ఇందుకోసం కొనిదెల ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి నిర్మాతగా మారాడు. ఆచార్య, సైరా వంటి చిత్రాలను నిర్మించాడు.

నటుడి నుంచి నిర్మాతగా

పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన చిరుత మూవీతో చరణ్ తెరంగేట్రం చేశాడు. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ మూవీ జంజిర్ రీమెక్ చేసి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అది ప్లాప్‌గా నిలిచింది.

తొలి సినిమా?

మూడు ఫిల్మ్‌ఫెర్, రెండు నంది అవార్డులు వచ్చాయి.

రామ్‌చరణ్ అవార్డులు?

చిరుత సినిమా హీరోయిన్ నేహా శర్మతో లవ్‌ ఆఫైర్ కొనసాగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో నిజం లేదు.

రామచరణ్‌పై వచ్చిన రూమర్‌?

రామ్ చరణ్ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో యాక్టింగ్ కోర్స్ చేశాడు. హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ కూడా ఇదే యాక్టింగ్ స్కూల్ లో కోర్స్ చేశారు.

యాక్టింగ్ ఎక్కడ?

రామ్ చరణ్ భార్య ఉపాసన బి పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ మరియు అపోలో ఛారిటీస్ వైస్ చైర్మన్.

చరణ్ భార్య గురించి?

చరణ్‌కు దైవ భక్తి ఎక్కువ. అయప్ప దీక్ష ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇంట్లో జరిగే అన్ని వ్రతాల్లో పాల్గొంటాడు.

చరణ్ దేవున్ని నమ్ముతాడా?

మార్చి 27 1985లో చెన్నైలో జన్మించాడు.

రామ్ చరణ్ ఎక్కడ జన్మించాడు?

మగధీర సినిమా రామ్‌ చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. 2009లో రిలీజైన ఈ సినిమా రూ.150కోట్లు కలెక్ట్ చేసింది. 757 రోజులు ఆడింది.

రామ్‌ చరణ్‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా?