మన సీజేఐ గురించి తెలుసా!

YouSay Short News App

తండ్రిబాటలో తనయుడు...

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్‌(డీవై చంద్రచూడ్) ప్రమాణ స్వీకారం చేశారు.

50వ సీజేఐ..

తండ్రీకుమారులు సీజేఐలుగా వ్యవహరించడం భారత చరిత్రలోనే తొలిసారి. డీవై చంద్రచూడ్ తండ్రి వైవీ చంద్రచూడ్‌ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

తొలిసారిగా..

1978 నుంచి 1985 వరకు సుమారు ఏడేళ్ల పాటు వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అత్యధిక కాలం పాటు పనిచేసిన సీజేఐగా ఘనత సాధించారు.

అత్యధిక కాలం సీజేఐగా..

సీజేఐ కుమారుడిగా పుట్టి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎదగడం డీవై చంద్రచూడ్‌కు దక్కిన అరుదైన గౌరవం. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 11, 1959న జన్మించారు.

నవంబరు 11న జననం..

జస్టిస్ డీవై చంద్రచూడ్ అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్‌లో ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనమిక్స్, డీయూ క్యాంపస్‌లో ఎల్ఎల్‌బీ చదివారు.

హార్వర్డ్‌లో ‘లా’

జస్టిస్ డీవై చంద్రచూడ్ 1998లో భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. అదే ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు.

సొలిసిటర్ జనరల్‌గా..

మార్చి 29, 2000 నుంచి బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అక్టోబరు 31, 2013 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

ప్రధాన న్యాయమూర్తిగా..

మే 13, 2016న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబరు 9, 2022న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

సుప్రీంకోర్టుకు..

అయోధ్య వివాదం, గోప్యత హక్కు, వ్యభిచారం, ఆధార్‌ చట్టబద్ధత, శబరిమల మొదలైన ఎన్నో కీలక అంశాలు, కేసుల్లో జస్టిస్‌ చంద్రచూడ్‌ చారిత్రక తీర్పులిచ్చారు.

విలక్షణ తీర్పులు..

జస్టిస్ యు.యు.లలిత్ తర్వాత చంద్రచూడ్ 50వ చీఫ్ జస్టిస్ అయ్యారు. జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10, 2024 వరకు ఉంటుంది. జస్టిస్ చంద్రచూడ్ సుప్రీం కోర్టులో ఇప్పటి వరకు రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు.

ఏడాది పాటు..