YouSay Short News App

పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం 

‘వారాహి’ పేరే ఎందుకు పెట్టారంటే?

‘వారాహి’ ప్రత్యేకతలు.

జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో “వారాహి” వాహనానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు.

ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని 'వారాహి' వాహనంపై  పవన్ కళ్యాణ్ మొదలు పెట్టనున్నారు. ఈక్రమంలో వారాహి వాహనం ప్రత్యేకతలపై స్పెషల్ స్టోరీ

పవన్‌ కళ్యాణ్‌ గత ప్రచారాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వారాహిని తయారు చేశారు. ప్రత్యేక భద్రతతో పాటు ఆధునాతన సాంకేతిక సౌకర్యాలు కల్పించారు.

వారాహి ప్రత్యేకతలు:

వారాహిలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారు. పవన్ ప్రసంగించే సమయంలో లైటింగ్ పరమైన సమస్యలు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక లైటింగ్

పవన్ కళ్యాణ్ వాడి వేడి ప్రసంగం వేల మందికి స్పష్టంగా వినిపించేలా ఆధునిక సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు

ఆధునిక సౌండ్ సిస్టమ్

వారాహి చూట్టూ సీసీ కెమెరాలు అమర్చారు. సభ నిర్వహించే ప్రదేశంలో జరిగే ఘటనలు రికార్డయ్యే విధంగా రియల్ టైం సర్వర్‌కు అనుసంధానం చేశారు.

నిరంతర నిఘా

వాహనం లోపల పవన్ కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునే ఏర్పాట్లు చేశారు.

చర్చా వేదిక

వాహనం లోపలి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్ల ద్వారా పవన్  వారాహి  మీదకు చేరవచ్చు. అక్కడి నుంచి ప్రసంగించవచ్చు.

హైడ్రాలిక్ సాంకేతికత

వారాహి అంటే దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు. అన్ని దిక్కులను రక్షించే దేవతగా 'వారాహి' అమ్మవారిని కొలుస్తారు. ఈ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వారాహి పేరును వాహనానికి పెట్టారు.

వారాహి పేరు ఎందుకు?

YouSay కంటెంట్‌ ఆస్వాదించినందుకు ధన్యవాదాలు.

ఈ వెబ్‌స్టోరి నచ్చితే షేర్ చేయండి.