YouSay Short News App

Sreeleela : ఒకేసారి 8 సినిమాల్లో నటిస్తున్న ‘ధమాకా’ బ్యూటీ

టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘శ్రీలీల’ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ‘పెళ్లిసందD’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ భామ వరుస సినిమాలకు సైన్ చేస్తోంది.

‘ధమాకా’ మూవీలో రవితేజ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా విజయం సాధించడంతో శ్రీలీలకు ఆఫర్లు క్యూ కట్టాయి.

మహేశ్ సినిమాలో..

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ‘SSMB28’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీల ఓ పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది.

బాలయ్య కూతురిగా..

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘NBK 108’ సినిమాలోనూ శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది. ఇందులో బాలకృష్ణ కూతురి పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

రామ్ సరసన..

బోయపాటి డైరెక్షన్‌లో రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో శ్రీలీల లీడ్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

నితిన్‌తో రొమాన్స్..

నితిన్ 32వ సినిమాలోనూ శ్రీలీల లీడ్ యాక్ట్రెస్‌గా నటిస్తోంది. వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

రాజుకు రాణిగా..

నవీన్ పొలిశెట్టి హీరోగా ‘అనగనగా ఒక రాజు’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులోనూ శ్రీలీల నటిస్తోంది.

మెగా హీరోతో..

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 29న సినిమా విడుదల చేయనున్నట్లు ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ ప్రకటించింది.

జూనియర్

మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘జూనియర్’. ఇందులోనూ శ్రీలీల నటిస్తోంది. డీఎస్పీ సంగీతం అందిస్తుండగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఉస్తాద్ భగత్‌సింగ్?

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాలో హీరోయిన్ పాత్రకు శ్రీలీలను సంప్రదించినట్లు సమాచారం. దాదాపుగా ఇందులో కన్ఫామ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్  వెబ్‌స్టోరీల  కోసం లింక్‌ని క్లిక్ చేయండి.